Sunday, 16 August 2026
  • Home  
  • 3 వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ కు సర్వం సిద్ధం
- విశాఖపట్నం

3 వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ కు సర్వం సిద్ధం

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి )ఆగస్టు 16:: విశాఖపట్నం నగరంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 22, 23 తేదీల్లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్ఠాత్మక కరాటే పోటీలు జరగనున్నాయి. డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌కు కరాటే ఇండియా, స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విక్టరీ షోటోకాన్ కరాటే డూ అసోసియేషన్–ఇండియా తదితర సంస్థల సహకారం అందిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్న నేపథ్యంలో విజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు పోటీల అనంతరం బహుమతులు, ప్రశంసలు అందించనున్నారు. కరాటే ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి )ఆగస్టు 16::
విశాఖపట్నం నగరంలో 3వ వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 22, 23 తేదీల్లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్ఠాత్మక కరాటే పోటీలు జరగనున్నాయి.

డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌కు కరాటే ఇండియా, స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విక్టరీ షోటోకాన్ కరాటే డూ అసోసియేషన్–ఇండియా తదితర సంస్థల సహకారం అందిస్తున్నాయి.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్న నేపథ్యంలో విజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు పోటీల అనంతరం బహుమతులు, ప్రశంసలు అందించనున్నారు.

కరాటే ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.