Thursday, 27 August 2026

Tag: వాతావరణం

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో దంచికొడుతున్న వర్షం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచి వర్షం దంచికొడుతోంది. సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండటంతో జనజీవనం కొంత ఇబ్బందులకు గురైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మంలో గురువారం వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.