Sunday, 27 September 2026

Tag: బ్రేకింగ్ న్యూస్

రంగారెడ్డి

తాడిపర్తిలో 33 ఏళ్ల మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

తాడిపర్తిలో 33 ఏళ్ల మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు యాచారం: యాచారం మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన దారా మంజుల (33) అదృశ్యమైన ఘటనపై యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంజుల తల్లి శ్రీమతి దారా రామచంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 131/2026గా వుమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయితే రాత్రి సమయంలో ఆమె ఇంట్లోనే నిద్రించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం సుమారు 5 గంటలకు కుటుంబ సభ్యులు నిద్రలేచి చూడగా మంజుల ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో ఓ లేఖ కూడా కనిపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యమైన మహిళ వివరాలు దారా మంజుల వయస్సు 33 సంవత్సరాలు. ఎత్తు సుమారు 5.7 అడుగులు, గుండ్రటి ముఖం, సాధారణ ఛాయ కలిగి ఉంటారని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో లైట్ పింక్ కలర్ టాప్, పింక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. మంజుల అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులను ఆరా తీస్తూ ఆమె ఎక్కడికి వెళ్లి ఉండవచ్చనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. మంజుల ఆచూకీ తెలిసిన వారు లేదా ఆమెను ఎక్కడైనా చూసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మహిళకు సంబంధించిన ఏదైనా సమాచారం లభించినా పోలీసులకు తెలియజేసి దర్యాప్తుకు సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రంగారెడ్డి

తక్కువ ఖర్చుతో ఆకర్షణీయమైన యాడ్స్ అందిస్తున్న ఏకైక సంస్థ — మన పున్నమి న్యూస్

పున్నమి న్యూస్ మీ వేడుకలకు మా పత్రికలో ప్రత్యేక ప్రచారం! తక్కువ ఖర్చుతో ఆకర్షణీయమైన యాడ్స్ అందిస్తున్న ఏకైక సంస్థ — మన పున్నమి న్యూస్ 🎉 మేము అందించే ప్రత్యేక ప్రకటనలు – 🎂 పుట్టినరోజు వేడుకల ప్రకటనలు – 💐 పెళ్లిరోజు వేడుకల ప్రకటనలు – 🕉️ దశదిశకర్మల ప్రకటనలు – 🎊 శుభకార్యాలు, ప్రత్యేక కార్యక్రమాల యాడ్స్ – 🏛️ రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకల ప్రకటనలు – 👥 ప్రజాప్రతినిధులు, నాయకుల అభినందన ప్రకటనలు ⚡ జస్ట్ 20 నిమిషాల్లో యాడ్ రెడీ! మీ వివరాలు, ఫొటో పంపించండి… ఆకర్షణీయమైన న్యూస్ పేపర్ స్టైల్‌లో యాడ్‌ను త్వరితగతిన సిద్ధం చేసి అందిస్తాము. 💰 తక్కువ ఖర్చు – మంచి ప్రచారం మీ శుభకార్యాలు, వేడుకలు, అభినందనలు పున్నమి న్యూస్ ద్వారా ప్రజలకు చేరేలా ప్రత్యేకంగా ప్రచారం చేసుకోండి. 📞 ప్రకటనల కోసం సంప్రదించండి 9640204826 పున్నమి న్యూస్ ప్రజల కోసం… ప్రజల వాణి…

రంగారెడ్డి

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ షెడ్‌ నిర్మాణం.. అధికారుల మౌనం ఎందుకు?

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ షెడ్‌ నిర్మాణం.. అధికారుల మౌనం ఎందుకు? అనుమతులు ఉన్నాయా..? ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందా..? టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల తీరుపై స్థానికుల అనుమానాలు పెద్ద అంబర్‌పేట్: ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్‌ నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రేకులు, ఇనుప నిర్మాణాలతో చేపడుతున్న ఈ షెడ్‌ నిర్మాణం ప్రస్తుతం పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం ప్రారంభ దశలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అడ్డుకోవాల్సి ఉండగా, నిర్మాణం దాదాపు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి నిర్మాణాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేసే అధికారులు.. ఇంత పెద్ద షెడ్‌ నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా.. లేదా? సదరు షెడ్‌ నిర్మాణానికి భవన నిర్మాణ అనుమతి, స్థల వినియోగానికి సంబంధించిన అనుమతులు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం మంజూరు చేశారనే విషయాలను అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లయితే ఇప్పటివరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మౌఖిక ఆదేశాలతోనే నిర్మాణాలా? పెద్ద అంబర్‌పేట్‌ పరిధిలో నిర్మాణ అనుమతుల వ్యవహారంపై గతంలోనూ ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో తాజా షెడ్‌ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మౌఖిక ఆదేశాలతో కొందరు నిర్మాణదారులు నిబంధనలను పక్కనబెట్టి నిర్మాణాలు చేపడుతున్నారా? అధికారుల పర్యవేక్షణ లేకుండానే ఇవి కొనసాగుతున్నాయా? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుతం ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందా? నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ రుసుములు, స్థల వినియోగం తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు తేలితే ప్రభుత్వానికి రావాల్సిన రుసుములు లేదా ఇతర ఆదాయానికి నష్టం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరపాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పెద్ద అంబర్‌పేట్‌లో నిర్మిస్తున్న షెడ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. కళ్లముందే జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ భారీ షెడ్‌ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

రంగారెడ్డి

నిరుపేద కుటుంబానికి అండగా.. రూ.10 వేల పెండ్లి కానుక

నిరుపేద కుటుంబానికి అండగా.. రూ.10 వేల పెండ్లి కానుక ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ మంచాల: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న మాజీ బండలేమూర్ గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన ఆంగోత్ శంకర్–బుజ్జి దంపతుల కుమార్తె ఆంగోత్ లావణ్య వివాహం సందర్భంగా మంగ శ్రీనివాస్ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి, నవ వధువుకు ఆశీస్సులు అందించారు. పేద కుటుంబాల ఇబ్బందులను గుర్తించి, ఎలాంటి పదవులు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తనకు చేతనైన రీతిలో సహాయం చేయడం అభినందనీయమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు వివాహానికి ఒక అన్నగా, మామగా వచ్చి ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన మంగ శ్రీనివాస్‌కు, ఆయన కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గత 10–13 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయం అందిస్తున్న మంగ శ్రీనివాస్ సేవలను పలువురు కొనియాడారు. పేద ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి సంతోషాల్లోనూ, కష్టాల్లోనూ భాగస్వామిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంతో పాటు మంచాల మండలంలో ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉండగా చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ వివాహ కార్యక్రమానికి, పోర్లగడ్డ తండాకు చెందిన మరో వివాహ కార్యక్రమానికి కూడా మాజీ గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్‌తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, మొదటి వార్డు సభ్యురాలు శిరీష చందు, తుల్జాభవాని యూత్ ప్రెసిడెంట్ కేలోత్ సురేందర్, యూత్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ యువ నాయకుడు శివలాల్, కాంగ్రెస్ యువ నాయకుడు అడ్వకేట్ కేలోత్ కిషన్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ యువ నాయకుడు కేలోత్ వినోద్, కాంగ్రెస్ యువ నాయకుడు వర్త్య శంకర్, కాంగ్రెస్ నాయకుడు పాతులోత్ కోట్య, కాంగ్రెస్ యువ నాయకుడు సపావట్ శివలాల్, కరంటోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

కొత్తపల్లిలో ఘనంగా బోనాల ఉత్సవాలు

కొత్తపల్లిలో ఘనంగా బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో గ్రామదేవతలకు బోనాలు సమర్పించిన మహిళలు.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో సందడిగా గ్రామం యాచారం, ఆగస్టు 23: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలైన బీరప్ప స్వామి, మల్లన్న, పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్లకు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సిద్ధం చేసుకుని ప్రత్యేక అలంకరణలతో దేవతల ఆలయాల వద్దకు చేరుకున్నారు. నైవేద్యంగా తయారు చేసిన బోనాలను తలపై ఎత్తుకుని, మంగళహారతులు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో గ్రామ వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. గ్రామదేవతలకు బోనాలు సమర్పించి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని భక్తులు ప్రార్థించారు. బోనాల సందర్భంగా గ్రామంలోని ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నైవేద్య కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బోనాలు సమర్పించి గ్రామదేవతల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పు వాయిద్యాలు, భక్తుల జైజై నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో పండుగ సందడి కనిపించింది. సంప్రదాయాలను కొనసాగిస్తూ గ్రామస్థులు ఐకమత్యంతో బోనాల వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చేపట్టారు. పండుగ సందర్భంగా గ్రామస్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామదేవతల బోనాల ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని గ్రామస్థులు పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం, పాడిపంటల అభివృద్ధి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని గ్రామదేవతలను వేడుకున్నట్లు చెప్పారు. బోనాల పండుగ సందర్భంగా కొత్తపల్లి గ్రామం మొత్తం భక్తి శ్రద్ధలతో కళకళలాడింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, యువత ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం, గ్రామ పెద్దల సమన్వయంతో వేడుకలు సజావుగా సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో కొత్తపల్లి గ్రామంలో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి.

రంగారెడ్డి

ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత!

ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత! శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 నుంచి 28 వరకు.. రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తాలు హైదరాబాద్, ఆగస్టు 22: ఈ ఏడాది రాఖీ పండుగను ఏ రోజున జరుపుకోవాలనే విషయంలో నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. ఆగస్టు 28వ తేదీనే రక్షాబంధన్‌ (రాఖీ పండుగ)ను జరుపుకోవాలని సూచించారు. పండితుల వివరాల ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 ఉదయం 9:48 గంటల వరకు కొనసాగనుంది. పౌర్ణమి తిథి ఆగస్టు 28న ఉండటంతో అదే రోజున సోదరులకు రాఖీలు కట్టుకోవడం శుభప్రదమని తెలిపారు. రాఖీ కట్టేందుకు ఉదయం 6:23 గంటల నుంచి 9:48 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 గంటల వరకు అభిజిత్‌ ముహూర్తం అనుకూలంగా ఉంటుందని పండితులు పేర్కొన్నారు. అదేవిధంగా రాఖీ పండుగ రోజున భద్ర కాలానికి సంబంధించి కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగియనున్నందున, ఆగస్టు 28న రోజంతా రాఖీలు కట్టుకోవడానికి అనుకూలమైన సమయమేనని స్పష్టం చేశారు. దీంతో సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానుబంధానికి ప్రతీకగా నిర్వహించే రక్షాబంధన్‌ వేడుకలను ఆగస్టు 28న కుటుంబ సభ్యుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.

రంగారెడ్డి

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చోరీ ఇబ్రహీంపట్నం: పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన ఘటనలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గజ్జ విజయ్‌కుమార్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్ రెడ్డి, సీఐ రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 20న వనస్థలిపురం ఎన్జీవో కాలనీ కూలీల అడ్డా వద్ద మంగమ్మ అనే మహిళను విజయ్‌కుమార్ సంప్రదించాడు. మన్నెగూడ సమీపంలో మేస్త్రీ పని ఉందని, మంచి కూలి డబ్బులు ఇస్తానని నమ్మించాడు. అనంతరం ఆమెను తన మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని ఆదిభట్ల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వైపు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలోని ఖాళీ స్థలానికి చేరుకున్న అనంతరం అక్కడ పని చేయాలని చెప్పి మహిళను బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న సుమారు 12 గ్రాముల బంగారు గొలుసును బలవంతంగా అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ ప్రదీప్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తులు చెప్పే ఉద్యోగ, కూలీ పనుల మాటలను నమ్మి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

రంగారెడ్డి

యాచారం రైతుల సమస్యలపై యోగేంద్ర యాదవ్‌కు వినతి

యాచారం రైతుల సమస్యలపై యోగేంద్ర యాదవ్‌కు వినతి ఫార్మా, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన ప్రతినిధులు రైతులకు పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చిన యోగేంద్ర యాదవ్ హైదరాబాద్: ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో యాచారం మండలంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, భరత్ జోడో ఉద్యమ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం హైదరాబాద్‌లో యోగేంద్ర యాదవ్‌ను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూసేకరణ ప్రక్రియలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మోసం చేసిందని, చట్టవ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రతినిధులు యోగేంద్ర యాదవ్‌కు వివరించారు. రైతులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు భూసేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా జూలై 5న తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభకు సంబంధించిన నివేదికను కూడా యోగేంద్ర యాదవ్‌కు అందజేశారు. స్థానిక రైతులు, ప్రజల అభిప్రాయాలు, భూసేకరణ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను నివేదికలో వివరించినట్లు తెలిపారు. రైతుల సమస్యలను సవివరంగా తెలుసుకున్న యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ.. యాచారం ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు చాలా అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నట్లు ప్రతినిధులు తెలిపారు. రైతుల హక్కుల పరిరక్షణకు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఈ అంశంపై రైతుల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పేరుతో తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, రైతుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ షెడ్‌ నిర్మాణం.. అధికారుల మౌనం ఎందుకు?

పెద్ద అంబర్‌పేట్‌లో అక్రమ షెడ్‌ నిర్మాణం.. అధికారుల మౌనం ఎందుకు? అనుమతులు ఉన్నాయా..? ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందా..? టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల తీరుపై స్థానికుల అనుమానాలు పెద్ద అంబర్‌పేట్: ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌లో అనుమతులు లేకుండానే భారీ షెడ్‌ నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రేకులు, ఇనుప నిర్మాణాలతో చేపడుతున్న ఈ షెడ్‌ నిర్మాణం ప్రస్తుతం పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం ప్రారంభ దశలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అడ్డుకోవాల్సి ఉండగా, నిర్మాణం దాదాపు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి నిర్మాణాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేసే అధికారులు.. ఇంత పెద్ద షెడ్‌ నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా.. లేదా? సదరు షెడ్‌ నిర్మాణానికి భవన నిర్మాణ అనుమతి, స్థల వినియోగానికి సంబంధించిన అనుమతులు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం మంజూరు చేశారనే విషయాలను అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లయితే ఇప్పటివరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మౌఖిక ఆదేశాలతోనే నిర్మాణాలా? పెద్ద అంబర్‌పేట్‌ పరిధిలో నిర్మాణ అనుమతుల వ్యవహారంపై గతంలోనూ ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో తాజా షెడ్‌ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మౌఖిక ఆదేశాలతో కొందరు నిర్మాణదారులు నిబంధనలను పక్కనబెట్టి నిర్మాణాలు చేపడుతున్నారా? అధికారుల పర్యవేక్షణ లేకుండానే ఇవి కొనసాగుతున్నాయా? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుతం ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందా? నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ రుసుములు, స్థల వినియోగం తదితర అంశాలను అధికారులు పరిశీలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు తేలితే ప్రభుత్వానికి రావాల్సిన రుసుములు లేదా ఇతర ఆదాయానికి నష్టం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరపాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పెద్ద అంబర్‌పేట్‌లో నిర్మిస్తున్న షెడ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. కళ్లముందే జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ భారీ షెడ్‌ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

రంగారెడ్డి

రూ.6.87 కోట్ల ఆస్తులు.. ఏవోపై ఏసీబీ కేసు!

రూ.6.87 కోట్ల ఆస్తులు.. ఏవోపై ఏసీబీ కేసు! ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏవో దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సహచరులకు సంబంధించిన మరో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భారీగా ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కర్మాన్‌ఘాట్‌లో రెండు ఫ్లాట్లు, సరూర్‌నగర్‌లో G+3 పెంట్‌హౌస్, యాచారం మండలం నల్లవెల్లి గ్రామ పరిధిలో 10 ఎకరాల 08 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, బాలాపూర్‌లోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో పెట్టుబడులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ.6.87 కోట్ల ఆస్తులు గుర్తింపు నగదు, బ్యాంకు ఖాతాల్లోని నిల్వలు, బంగారు ఆభరణాలు, వాహనాలు తదితరాలను కలిపి సుమారు రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా 46 తులాల బంగారాన్ని కుదువపెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నట్లు కూడా సోదాల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలోనూ కేసు దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై గతంలో 2009లోనూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుత కేసులో గుర్తించిన ఆస్తులు ఆయన చట్టబద్ధమైన ఆదాయానికి అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. సోదాల్లో లభించిన పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.