నిరుపేద కుటుంబానికి అండగా.. రూ.10 వేల పెండ్లి కానుక
ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్
మంచాల: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న మాజీ బండలేమూర్ గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన ఆంగోత్ శంకర్–బుజ్జి దంపతుల కుమార్తె ఆంగోత్ లావణ్య వివాహం సందర్భంగా మంగ శ్రీనివాస్ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి, నవ వధువుకు ఆశీస్సులు అందించారు.
పేద కుటుంబాల ఇబ్బందులను గుర్తించి, ఎలాంటి పదవులు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తనకు చేతనైన రీతిలో సహాయం చేయడం అభినందనీయమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ ఇంటి ఆడపడుచు వివాహానికి ఒక అన్నగా, మామగా వచ్చి ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన మంగ శ్రీనివాస్‌కు, ఆయన కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
గత 10–13 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ నిరుపేద కుటుంబాలకు తనవంతు సహాయం అందిస్తున్న మంగ శ్రీనివాస్ సేవలను పలువురు కొనియాడారు. పేద ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి సంతోషాల్లోనూ, కష్టాల్లోనూ భాగస్వామిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంతో పాటు మంచాల మండలంలో ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉందని గ్రామస్థులు తెలిపారు.
ఇదిలా ఉండగా చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ వివాహ కార్యక్రమానికి, పోర్లగడ్డ తండాకు చెందిన మరో వివాహ కార్యక్రమానికి కూడా మాజీ గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్‌తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, మొదటి వార్డు సభ్యురాలు శిరీష చందు, తుల్జాభవాని యూత్ ప్రెసిడెంట్ కేలోత్ సురేందర్, యూత్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ యువ నాయకుడు శివలాల్, కాంగ్రెస్ యువ నాయకుడు అడ్వకేట్ కేలోత్ కిషన్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ యువ నాయకుడు కేలోత్ వినోద్, కాంగ్రెస్ యువ నాయకుడు వర్త్య శంకర్, కాంగ్రెస్ నాయకుడు పాతులోత్ కోట్య, కాంగ్రెస్ యువ నాయకుడు సపావట్ శివలాల్, కరంటోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.



