Thursday, 1 October 2026

Tag: జగ్గంపేట

తూర్పు గోదావరి

వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

*జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా జయంతి వేడుకలు* *కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 26:* మానవసేవే మాధవసేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలు అందించిన అమృతమూర్తి, దయామయి మదర్ థెరిస్సా జయంతి వేడుకలు వాకర్స్ హెల్త్ క్లబ్ (జగ్గంపేట) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదర్ థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు( కొండబాబు) మాట్లాడుతూ మానవతా మూర్తి, మానవసేవే మాధవసేవగా భావించే మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ఒక పవిత్రమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ఆమె సమాజానికి అందించిన అసమాన త్యాగాన్ని, పవిత్ర సేవలను స్మరించుకుంటూ ఆమె చూపిన కరుణా మార్గంలో పయనించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రోగుల ఆరోగ్యం, సంతోషం కొరకు ఆకాంక్షించడం, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం, మదర్ థెరిస్సా సేవానిరతిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలోవాకర్స్ క్లబ్ ఫౌండర్, మాజీ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) వెచ్చ నాగసత్య ఎం సురేష్, చంద్రమౌళి వెంకట శాస్త్రి, రాజేష్ పొట్టి రాజేష్:వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

*కంటే బుల్లెబ్బును, పోలినాటి ఎజ్రా శాస్త్రిని పరామర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి ఆగస్టు 25: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన కాట్రావులపల్లి ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ కంటే రామారావు (బుల్లెబ్బు ) ఇటీవలే గుండెకు ఫేస్ మేకర్ వేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పోలినాటి ధర్మానందకుమారి భర్త సీనియర్ టిడిపి నాయకులు ఎజ్రా శాస్త్రి కాలికి గాయం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని పరామర్శించి ఆరోగ్య విషయాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, అడబాల వెంకటేశ్వరరావు, బుర్రి సత్తిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి ముసిరెడ్డి నాగేశ్వరరావు, సుంకర సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి సహాయ నిధి 12 మందికి 5,38,244 విలువైన చెక్కులను అందించిన జ్యోతుల నవీన్

*పేదల ప్రాణాలకు భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి – కాట్రావులపల్లిలో 12 మందికి 5,38,244 విలువైన చెక్కుల పంపిణీ – ఇంటింటికి వెళ్లి పరామర్శించి చెక్కులు అందజేసిన జ్యోతుల నవీన్* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధిఆగస్టు 25: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో 12 మందికి 5,38,244 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు కావడంతో మంగళవారం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 12 మంది ఇండ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారకుండా సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.ఈరోజు నుండి ఏ గ్రామంలో చెక్కుల పంపిణీ ఉన్నా ఆ గ్రామానికి స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించి చెక్కులు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రజల కష్టంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మామిడాడలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు

జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 25 జగ్గంపేట మండలం మామిడాడ పంచాయతీలో ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు ఇంటింటికి వెళ్లి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఇంటికి తిరిగి టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎక్స్ ఎంపీటీసీ పెంటకోట సత్తిబాబు, ఆరో వార్డ్ మెంబర్ మల్లా వెంకటస్వామి , బూత్ ఇంచార్జ్ దెయ్యాల సత్తిబాబు, పండు, రాంబాబు, పాల్గొన్నారు

తూర్పు గోదావరి

నిరుద్యోగ యువత కు బృహత్తర పథకం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*జగ్గంపేట నిరుద్యోగ యువతకు బృహత్తర పథకం – ప్రతి నిరుద్యోగి బయోడేటా వెబ్ సైట్ లో – భవిష్యత్తులో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 26: స్థానిక రావులమ్మ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, సోషల్ మీడియా ప్రతినిధులతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగులను గుర్తించి వారి విద్యార్హతను బట్టి పూర్తి బయోడేటాను సేకరించి ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపరుస్తామని, తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ వారికి చేరేలా చేస్తామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,060 పోస్టుల జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ తో పాటు రాష్ట్రంలో రాబోయే భారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు. కాకినాడ గ్రీన్ ఎనర్జీ, నక్కపల్లి స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్ట్ వంటి సంస్థల ద్వారా రాబోయే రోజుల్లో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు రానున్నాయని, వాటిలో అర్హతను బట్టి జగ్గంపేట యువతకు ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు.ఇవే కాకుండా ఉద్యోగం రాని వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా వారి అర్హతను బట్టి కల్పించేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన మెగా డీఎస్సీలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 450 మందికి ఉచిత శిక్షణ ఇస్తే 350 మంది క్వాలిఫై అయ్యారని, 150 మంది ఉత్తీర్ణులై 30 మందికి ఉద్యోగాలు వచ్చాయని, జగ్గంపేట నియోజకవర్గం నుండి 112 మంది టీచర్ పోస్టులు సాధించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఎక్కువ మంది నియోజకవర్గ యువత ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తో రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని, ఆ అవకాశాలను జగ్గంపేట యువత అందిపుచ్చుకునేలా చేయడమే తన లక్ష్యమని అన్నారు. ప్రతి నిరుద్యోగి ఉద్యోగం సాధించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీవో చంద్రశేఖర్, కిర్లంపూడి ఎంపీడీవో హరికృష్ణ, గండేపల్లి ఎంపీడీవో హరికృష్ణ సత్య రెడ్డి,గోకవరం ఎంపీడీవో గోవిందు, నియోజకవర్గంలోని డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గోలి వరాహలమ్మ ప్రథమ వర్ధంతి, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి స్వర్గీయ గోలి వరహాలమ్మ గారి ప్రథమ వర్ధంతి* *హాజరై నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,ఆగస్టు 24: జగ్గంపేట గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి గోలి వరహాలమ్మ గారి ప్రథమ వర్ధంతి స్థానిక గోకవరం రోడ్ లోని అల్లూరి సీతారామరాజు క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వర్గీయ గోలి వరహాలమ్మ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ గోలి శ్రీరాములు ను, వారి కుమారులు గోలి శ్రీనివాస్, గంగారామ్ చౌదరి, అల్లుడు మోదుకూరి సత్తిరాజు లను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లో వరహాలమ్మ గారి పేరు మీద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కుంచే తాతాజీ, కంచుమర్తి రాఘవ, వేములకొండ జోగారావు, వత్సవాయి వరహాల బాబు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

*జగ్గంపేట టౌన్ టిడిపి నాయకులు గంటా రవణ కుటుంబాన్ని, జగ్గంపేటలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 24: జగ్గంపేట టౌన్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గంటా రమణ ఆదివారం స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ సోమవారం జగ్గంపేటలో రమణ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుమారులు అర్జున్, నవీన్ లను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన పుర్రె లోవరాజు( సంబు) తల్లి బుచ్చిరాజు ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం గన్రెడ్డి సత్యనారాయణ ఇటీవలే మరణించడంతో వారి భార్య సత్యవతిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే నెహ్రూ ఆయన వెంట జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కంచుమర్తి రాఘవ, పీలా మహేష్, మారిశెట్టి రాధా, కింగం రామకృష్ణ, మారిశెట్టి గంగ, కోడూరి రమేష్, ఎండి కాజా, పుర్రె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వం జాబు క్యాలెండర్ విడుదల 10060 పోస్టులు భర్తీకి

*నిరుద్యోగులకు శుభవార్త – 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల – నియోజకవర్గ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,: ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త అందించిందని, వివిధ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేసిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని పేజ్ వన్ 1523 ఉత్తమ విద్యకు సంబంధించిన పోస్టులు, పేజ్ టు సెప్టెంబర్ 15న గ్రూప్-1, పోలీస్ శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ కు సంబంధించిన 3,231 పోస్టులు, పేజ్ 3 అక్టోబర్ 15న గ్రూప్-2 పోస్టులు, ఇరిగేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రోడ్డు రవాణా శాఖ సంబంధించిన 2,311 పోస్టులు, పేజ్4, అక్టోబర్ 15న డీఎస్సీ 2995 పోస్టులు, మొత్తం నాలుగు విడతలలో 1,060 పోస్టుల భర్తీకి నోటీపీకేషన్ విడుదలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు.ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశమని, గత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం యువత ఎదురుచూసి నిరాశ చెందిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి నిరుద్యోగుల్లో భరోసా నింపిందని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత అంతా అప్రమత్తంగా ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమై మన నియోజకవర్గం నుండి అత్యధిక ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. యువతకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, మాజీ వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం చిన్నారుల భవిష్యత్తుకు పునాది

*జగ్గంపేటలో అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణలో నూతన ఉత్సాహం – చిన్నారుల భవిష్యత్తుకు పునాది… ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ* కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 22:జగ్గంపేట పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీ కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి రెండు, మూడు విడత శిక్షణ కార్యక్రమం మూడవ దశ ఆగస్టు22, ఆగస్టు 24, నుండి ఆగస్టు 25 వరకు కొనసాగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ సందర్శించి శిక్షణలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడారు. శిక్షణలో అందిస్తున్న అంశాలు, బోధనా పద్ధతులు, కార్యకర్తల అవగాహన తదితర అంశాలను పరిశీలించారు.ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేసి చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం అధికారి పూర్ణిమ మాట్లాడుతూ జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన నూట అరవై ఆరు మంది అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.జ్ఞాన జ్యోతి శిక్షణ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల్లో నైపుణ్యాలను పెంపొందించి చిన్నారులకు నాణ్యమైన పూర్వ పాఠశాల విద్య అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణలో జిల్లా వనరుల వ్యక్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, పర్యవేక్షకురాలు అమ్మాజీ, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ఒకటి స్వామి, మండల విద్యాశాఖాధికారి రెండు సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు పాండురంగారావు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసిన తుమ్మలపల్లి రమేష్

*జగ్గంపేట లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసిన తుమ్మలపల్లి రమేష్* కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి, ఆగష్టు 22: జగ్గంపేట టౌన్‌లోని కృష్ణవేణి థియేటర్ వద్ద జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినీ, రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శమని, ఆయన సేవా స్ఫూర్తి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమం లో జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.