*పేదల ప్రాణాలకు భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి – కాట్రావులపల్లిలో 12 మందికి 5,38,244 విలువైన చెక్కుల పంపిణీ – ఇంటింటికి వెళ్లి పరామర్శించి చెక్కులు అందజేసిన జ్యోతుల నవీన్*
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధిఆగస్టు 25:
జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో 12 మందికి 5,38,244 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు కావడంతో మంగళవారం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై 12 మంది ఇండ్లకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వరంగా మారాయని అన్నారు.
ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీల భేదాలు లేకుండా అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుకే పరిమితమైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారకుండా సీఎం సహాయనిధి ద్వారా నేరుగా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.ఈరోజు నుండి ఏ గ్రామంలో చెక్కుల పంపిణీ ఉన్నా ఆ గ్రామానికి స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించి చెక్కులు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రజల కష్టంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




