Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గోలి వరాహలమ్మ ప్రథమ వర్ధంతి, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోలి వరాహలమ్మ ప్రథమ వర్ధంతి, నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

వార్త ముఖ్యాంశాలు

  • *డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి స్వర్గీయ గోలి వరహాలమ్మ గారి ప్రథమ వర్ధంతి* *హాజరై నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,ఆగస్టు 24: జగ్గంపేట గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి గోలి వరహాలమ్మ గారి…
  • ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వర్గీయ గోలి వరహాలమ్మ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
  • అనంతరం డాక్టర్ గోలి శ్రీరాములు ను, వారి కుమారులు గోలి శ్రీనివాస్, గంగారామ్ చౌదరి, అల్లుడు మోదుకూరి సత్తిరాజు లను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

*డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి స్వర్గీయ గోలి వరహాలమ్మ గారి ప్రథమ వర్ధంతి*
*హాజరై నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*

కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి,ఆగస్టు 24: జగ్గంపేట గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి గోలి వరహాలమ్మ గారి ప్రథమ వర్ధంతి స్థానిక గోకవరం రోడ్ లోని అల్లూరి సీతారామరాజు క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వర్గీయ గోలి వరహాలమ్మ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ గోలి శ్రీరాములు ను, వారి కుమారులు గోలి శ్రీనివాస్, గంగారామ్ చౌదరి, అల్లుడు మోదుకూరి సత్తిరాజు లను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ లో వరహాలమ్మ గారి పేరు మీద అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కుంచే తాతాజీ, కంచుమర్తి రాఘవ, వేములకొండ జోగారావు, వత్సవాయి వరహాల బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *