వార్త ముఖ్యాంశాలు
- అసలే ఉక్కపోత, ఆపై బస్టాండ్ ఆవరణంలో మంటలు పట్టించుకోని అధికారులు.
- తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నల్లజర్ల లో ఏలూరు రాజమహేంద్రవరం వెళ్లే దారిలో వున్న బస్ షెల్టర్ నందు మొక్కజొన్న పొత్తులు వేరుశనగ కాయలు జామపళ్లు అమ్ముకొనే వారు బస్టాండ్ ఆవరణంలో కట్టెలు పోయి పెట్టి పెద్ద పెద్ద మంటలు వేస్తూ ప్రజలకి…
- భయంకరమైన వేడి వస్తుండటం తో ఉక్కపోతకు ప్రజలు బేమ్బెబేలెత్తి పోతున్నారు పైగా ఎండలు మండుతున్న వేళ చెమటలు కక్కు తున్న పరిస్థితి ప్రయాణికులు మంటలు తీసేయమని అడిగేతే ప్రయాణికుల మీద తిరుగు పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది .
అసలే ఉక్కపోత, ఆపై బస్టాండ్ ఆవరణంలో మంటలు
పట్టించుకోని అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, నల్లజర్ల లో ఏలూరు రాజమహేంద్రవరం వెళ్లే దారిలో వున్న బస్ షెల్టర్ నందు మొక్కజొన్న పొత్తులు వేరుశనగ కాయలు జామపళ్లు అమ్ముకొనే వారు బస్టాండ్ ఆవరణంలో కట్టెలు పోయి పెట్టి పెద్ద పెద్ద మంటలు వేస్తూ ప్రజలకి ఆటంకం కలిగిస్తున్నారు పుగా కళ్ళలోకి వెళ్లి కళ్ళు మంటలతో ఇబ్బందులు పడుతున్నారు చంటి పిల్లలు సైతం గుక్క తిపప్పకుండా ఊపిరి ఆడక ఏడుస్తున్నారు . భయంకరమైన వేడి వస్తుండటం తో ఉక్కపోతకు ప్రజలు బేమ్బెబేలెత్తి పోతున్నారు పైగా ఎండలు మండుతున్న వేళ చెమటలు కక్కు తున్న పరిస్థితి ప్రయాణికులు మంటలు తీసేయమని అడిగేతే ప్రయాణికుల మీద తిరుగు పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది . గడచిన రెండు నెలల క్రితం బస్ చెకింగ్ ఆఫీసర్స్ బెజవాడ నుండి వచ్చిన వారు కంట పడగానే వారు మంటలు అదుపులో కి తీసుకు వచ్చారు మళ్ళీ పెట్టము అని చెప్పిన వారు . మాట మరచి మళ్ళీ అదే ప్రాంతంలోమంటలు పెట్టి ప్రయాణికులు కి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి అక్కడ మంటలు లేకుండా అదుపు చేయాలనీ ప్రయాణికులు అధికారులను వేడుకొంటున్నారు ఆవిధంగా మంటలు పెట్టడoవల్ల జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించి తగు చర్యలు తెయనుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.