వార్త ముఖ్యాంశాలు
- *జగ్గంపేట టౌన్ టిడిపి నాయకులు గంటా రవణ కుటుంబాన్ని, జగ్గంపేటలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 24: జగ్గంపేట టౌన్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గంటా రమణ ఆదివారం స్వర్గస్తులైనారు.
- విషయం తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ సోమవారం జగ్గంపేటలో రమణ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
- అనంతరం వారి కుమారులు అర్జున్, నవీన్ లను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
*జగ్గంపేట టౌన్ టిడిపి నాయకులు గంటా రవణ కుటుంబాన్ని, జగ్గంపేటలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 24: జగ్గంపేట టౌన్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గంటా రమణ ఆదివారం స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ సోమవారం జగ్గంపేటలో రమణ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుమారులు అర్జున్, నవీన్ లను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన పుర్రె లోవరాజు( సంబు) తల్లి బుచ్చిరాజు ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం
గన్రెడ్డి సత్యనారాయణ ఇటీవలే మరణించడంతో వారి భార్య సత్యవతిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే నెహ్రూ ఆయన వెంట జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కంచుమర్తి రాఘవ, పీలా మహేష్, మారిశెట్టి రాధా, కింగం రామకృష్ణ, మారిశెట్టి గంగ, కోడూరి రమేష్, ఎండి కాజా, పుర్రె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.