Monday, 21 September 2026

Tag: రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి

నాగోల్‌లో ఘనంగా శ్రీ గాయత్రి ఫ్యాషన్ జ్యువలరీ ప్రారంభం.. ఆకర్షణీయమైన డిజైన్లలో 1 గ్రాము గోల్డ్ జ్యువలరీ.. అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆభరణాలు

నాగోల్: నాగోల్ డివిజన్‌లోని ఆనంద్ నగర్ చౌరస్తాలో డీఎంఆర్ ఆర్కేడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గాయత్రి ఫ్యాషన్ జ్యువలరీ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. షోరూమ్‌ను వెంకటమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి ఫ్యాషన్ జ్యువలరీ యజమానులు జీడిమెట్ల లక్ష్మణ్, హేమలత మాట్లాడుతూ.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన డిజైన్లలో ఫ్యాషన్ జ్యువలరీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా 1 గ్రాము గోల్డ్ జ్యువలరీలో వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన, ఆకర్షణీయమైన ఆభరణాలను అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

రంగారెడ్డి

రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. 16వ ఏటా భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు.. 3,000 మందికి పైగా భక్తులకు అన్నదానం

ఎల్బీనగర్: ఎన్జీవోస్ కాలనీ, సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత 16 సంవత్సరాలుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 3,000 మందికి పైగా భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 21న లడ్డు వేలం పాట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డు వేలం పాటను విజయవంతం చేయాలని వారు కోరారు. రామసేన యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రాజు ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసోసియేషన్ సభ్యులు నరేష్, ఆంజనేయులు, రమేష్, ప్రభాత్, చంటి, తులసి, ఖాజా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

ఎల్.బి.నగర్ శ్రీకాంత్ చారి చౌరస్తాలో వైభవంగా విశ్వకర్మ జయంతి.. స్వర్ణకార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ మహోత్సవ ఊరేగింపు

ఎల్.బి.నగర్: విశ్వసృష్టికర్త శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఎల్.బి.నగర్, మన్సూరాబాద్ స్వర్ణకార ఐక్య వేదిక ఆధ్వర్యంలో యజ్ఞ మహోత్సవ ఊరేగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్ చారి విగ్రహం చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్–మన్సూరాబాద్ స్వర్ణకార ఐక్య వేదిక సభ్యులు మారోజు రమేష్ చారి, చిలుకూరి రామాచారి, బాణాగర్ వేణు గోపాల చారి, రాచకొండ సురేష్ కుమార్ చారి, ముమ్మడి శివ కుమార్ చారి, రాచకొండ శ్రీనివాస చారి, కృపాకర్ చారి, ఇటుకాల వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అన్నదానం.. వినాయక చవితి సందర్భంగా 1000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ

ఎల్బీనగర్: కర్మాన్‌ఘాట్ మైత్రిపురం కాలనీలోని భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ ప్రాంగణంలో మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యంతో మెరుగైన సమాజాన్ని నిర్మించడమే తమ లక్ష్యమన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తున్నామని, సేవ చేయడంలోనే నిజమైన తృప్తి ఉందని తెలిపారు. హాస్పిటల్‌లో మానసిక ఆరోగ్యం, నరాల సంబంధిత సమస్యలకు నిపుణుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యసన విముక్తి, కుంగుబాటు, స్కిజోఫ్రేనియా, ఆందోళన, భయాలు, నిద్ర సమస్యలు, మూర్ఛ, జ్ఞాపకశక్తి లోపాలు తదితర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ సి. గోవర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

హస్తినాపురంలో ఘనంగా హనీ మోటార్స్ మల్టీబ్రాండ్ షోరూమ్ ప్రారంభం

పున్నమి: ఎల్బీనగర్, స్తినాపురం జెడ్పీ రోడ్డులో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సమీపంలో హనీ మోటార్స్ పేరుతో నూతన మల్టీబ్రాండ్ టూ వీలర్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. షోరూమ్‌ను యజమాని తాటికొండ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగన్, యెరుగండ్లపల్లి సర్పంచ్ వొళ్ళమ్ల సంతోష్ యాదవ్ హాజరై షోరూమ్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యజమాని తాటికొండ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన ద్విచక్ర వాహనాలను ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన సేవలు, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార ప్రముఖులు, స్థానికులు తదితరులు పాల్గొని హనీ మోటార్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

రంగారెడ్డి

మాధవ నగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు… మూడో రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ సభ్యులు

పున్నమి: రంగారెడ్డి జిల్లా: ఎల్బీనగర్: మాధవ నగర్: మాధవ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మాధవ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ తోపాటు వాస్తు జంగారెడ్డి, దిండి నారాయణరెడ్డి, పురుషోత్తం రెడ్డి, లక్ష్మారెడ్డి, విక్రమ్ రాజు, రాజేందర్ రెడ్డి, ముత్యాలు, మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ, కడారి రాజేష్ యాదవ్, బొడ్ల మల్లికార్జున్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కాలనీ సభ్యులు భక్తిశ్రద్ధలతో గణేశుడికి పూజలు నిర్వహించి, ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

రంగారెడ్డి

పతకాల పంట పండించిన హయత్‌నగర్ టైగర్స్.. జాతీయ కుంగ్‌ఫు, కరాటే ఛాంపియన్‌షిప్‌లో 35 మంది విద్యార్థుల సత్తా

హయత్ నగర్: భువనగిరిలోని శ్రీ సాయి శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 5వ జాతీయ కుంగ్‌ఫు, కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్–2026లో హయత్‌నగర్ టైగర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో 35 మంది విద్యార్థులు పాల్గొని 20 గోల్డ్, 8 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. టైగర్స్ కుంగ్‌ఫు కరాటే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో మాస్టర్ మునుకుంట్ల శివ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కుంగ్‌ఫు, కటాస్, స్పారింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. అండర్-12 బాలికల స్పారింగ్ విభాగంలో వి. శ్రీనిధి గ్రాండ్ ఛాంపియన్‌షిప్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా మాస్టర్ శివ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్వీయ రక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల విజయంపై అకాడమీ నిర్వాహకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి

గణేష్ మండపాల వద్ద డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన.. ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలి: SHO శంకరయ్య

హయత్‌నగర్, గణేష్ ఉత్సవాలు–2026 సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సీపీ బి. సుమతి ఆదేశాల మేరకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల వద్ద డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ SHO CH. శంకరయ్య, EAGLE టీమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాము, SIలు డి. కృష్ణయ్య, కె. అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, సహచరి సిబ్బందితో కలిసి పెద్ద అంబర్‌పేట్, కుంట్లూరు గ్రామం శివాలయం రోడ్ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులు, యువత, మండపాల నిర్వాహకులకు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, సామాజిక దుష్ప్రభావాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. అలాగే మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, జనసందోహం నియంత్రణ, పార్కింగ్ తదితర భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. గణేష్ పూజా కార్యక్రమాలు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని SHO శంకరయ్య కోరారు.

రంగారెడ్డి

వనస్థలిపురం ఆటోనగర్‌లో ఘనంగా “శ్రీ కామాక్షి కేఫ్” ఘనంగా ప్రారంభం

రంగారెడ్డి జిల్లా: వనస్థలిపురం ఆటోనగర్‌లో “శ్రీ కామాక్షి కేఫ్ – ప్యూర్ వెజ్” నూతన శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కేఫ్ నిర్వాహకులు సత్యనారాయణ, రఘునాథ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, యాంకర్/నటుడు అనసూయ భరద్వాజ్ హాజరయ్యారు. కేఫ్‌లో స్వచ్ఛమైన శాకాహార వంటకాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన ఆహారం, రుచికరమైన వంటకాలతో కస్టమర్లకు మంచి సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులు కేఫ్‌ను సందర్శించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎవిఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేఫ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు ప్యూర్ వెజ్ ఫుడ్‌కు మరో మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల ఆదరణతో కేఫ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు సత్యనారాయణ, రఘునాథ్ తెలిపారు.

రంగారెడ్డి

పరమేశ్వర కాలనీలో రూ.58 లక్షలతో నూతన సీసీ రోడ్ల మంజూరు. మధుయాష్కి గౌడ్, రవీందర్ గౌడ్‌లకు కాలనీ ప్రెసిడెంట్ సుంకరి వెంకన్న గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు

హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లోని పరమేశ్వర కాలనీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.58 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కాలనీలో మిగిలి ఉన్న మట్టి రోడ్ల స్థానంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సీసీ రోడ్ల మంజూరుకు విశేషంగా కృషి చేసిన ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్కు పరమేశ్వర కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలనీ అధ్యక్షులు సుంకరి వెంకన్న గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మంజూరు ప్రక్రియలో కాలనీ వాసులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించిన హయత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చెన్నగోని రవీందర్ గౌడ్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ముద్దం పరమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అక్కి రమేష్, ఉపాధ్యక్షులు కాటేపల్లి ముత్యాలు గౌడ్, కోశాధికారి రాపోలు జ్ఞానేశ్వర్, జాయింట్ సెక్రటరీ ఆలకుంట్ల శ్రీధర్, గౌరవ సలహాదారులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, పజ్జురు మోహన్ రెడ్డి, కంకణాల మల్లారెడ్డి, సన్నాయిల ప్రసాద్, కందాల చంద్రారెడ్డి, పరమేశ్వర కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.