Thursday, 17 September 2026
  • Home  
  • పతకాల పంట పండించిన హయత్‌నగర్ టైగర్స్.. జాతీయ కుంగ్‌ఫు, కరాటే ఛాంపియన్‌షిప్‌లో 35 మంది విద్యార్థుల సత్తా
- రంగారెడ్డి

పతకాల పంట పండించిన హయత్‌నగర్ టైగర్స్.. జాతీయ కుంగ్‌ఫు, కరాటే ఛాంపియన్‌షిప్‌లో 35 మంది విద్యార్థుల సత్తా

హయత్ నగర్: భువనగిరిలోని శ్రీ సాయి శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 5వ జాతీయ కుంగ్‌ఫు, కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్–2026లో హయత్‌నగర్ టైగర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో 35 మంది విద్యార్థులు పాల్గొని 20 గోల్డ్, 8 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. టైగర్స్ కుంగ్‌ఫు కరాటే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో మాస్టర్ మునుకుంట్ల శివ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కుంగ్‌ఫు, కటాస్, స్పారింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. అండర్-12 బాలికల స్పారింగ్ విభాగంలో వి. శ్రీనిధి గ్రాండ్ ఛాంపియన్‌షిప్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా మాస్టర్ శివ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్వీయ రక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల విజయంపై అకాడమీ నిర్వాహకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

హయత్ నగర్: భువనగిరిలోని శ్రీ సాయి శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 5వ జాతీయ కుంగ్‌ఫు, కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్–2026లో హయత్‌నగర్ టైగర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో 35 మంది విద్యార్థులు పాల్గొని 20 గోల్డ్, 8 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

టైగర్స్ కుంగ్‌ఫు కరాటే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో మాస్టర్ మునుకుంట్ల శివ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కుంగ్‌ఫు, కటాస్, స్పారింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. అండర్-12 బాలికల స్పారింగ్ విభాగంలో వి. శ్రీనిధి గ్రాండ్ ఛాంపియన్‌షిప్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా మాస్టర్ శివ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్వీయ రక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల విజయంపై అకాడమీ నిర్వాహకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.