హయత్‌నగర్, గణేష్ ఉత్సవాలు–2026 సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సీపీ బి. సుమతి ఆదేశాల మేరకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల వద్ద డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ SHO CH. శంకరయ్య, EAGLE టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాము, SIలు డి. కృష్ణయ్య, కె. అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, సహచరి సిబ్బందితో కలిసి పెద్ద అంబర్పేట్, కుంట్లూరు గ్రామం శివాలయం రోడ్ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సందర్శించారు.
ఈ సందర్భంగా భక్తులు, యువత, మండపాల నిర్వాహకులకు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, సామాజిక దుష్ప్రభావాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. అలాగే మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, జనసందోహం నియంత్రణ, పార్కింగ్ తదితర భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
గణేష్ పూజా కార్యక్రమాలు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని SHO శంకరయ్య కోరారు.




