Tuesday, 8 September 2026

Tag: #బిజెపిఖమ్మం

ఖమ్మం

ఫీజు బకాయిలు విడుదల చేయాలి.. అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ బీజేవైఎం ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఖమ్మం కాల్వొడ్డు సెంటర్‌లో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సాయి రామ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావ్ గౌడ్, ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు RVS యాదవ్, ఆచంటి కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య, పిల్లలమర్రి వెంకట్, వాళ్లల రమేష్, వీరభద్రం, బోయినపల్లి చంద్రశేఖర్, పిట్టల వెంకట్ నరసయ్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు

ఖమ్మం

అసెంబ్లీ ముట్టడిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బిజెపి నేతల అరెస్ట్.

హైదరాబాద్ / ఖమ్మం హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నున్న రవికుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని షాలిబండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఖమ్మం

ముందస్తు అరెస్టులతో బీజేపీ ఉద్యమాన్ని అడ్డుకోలేరు: గల్లా సత్యనారాయణ

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, బకాయిల విడుదల డిమాండ్‌తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లా పోలీసులు సోమవారం వేకువజామున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన పున్నమి న్యూస్‌తో మాట్లాడుతూ తెలంగాణలో ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. ముందస్తు అరెస్టులతో బీజేపీ నాయకులను భయపెట్టాలని చూస్తే మరింత ఉధృతంగా విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఖమ్మం

ఖమ్మం బిజెపి నేతల హౌస్ అరెస్టులు..

చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో ఖమ్మంలో బీజేపీ నాయకులపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు RVS యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్, గడీల నరేష్, వీరవెల్లి రాజేష్ గుప్తా, కందుల శ్రీ కృష్ణ, రుద్రగాని మాధవ్, బోయినపల్లి సురేష్లను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా నేతలను నిర్బంధించడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.

ఖమ్మం

హౌస్ అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతును అణచలేరు చలో అసెంబ్లీ నేపథ్యంలో బీజేపీ, బీజేవైఎం నేతల ముందస్తు నిర్బంధంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ / ఖమ్మం తెలంగాణలో ప్రజాస్వామ్య నిరసనలను హౌస్ అరెస్టులు, ముందస్తు నిర్బంధాలతో అణచివేయడం సరికాదని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను సోమవారం ఉదయం వారి ఇళ్ల వద్దే పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలందరినీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు, 22A సహా ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య బాధ్యత కూడా అని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాయరాదన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణలో జరుగుతున్న ముందస్తు నిర్బంధాలపై కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజల గొంతును అరెస్టులతో అణచలేరని, ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం గౌరవించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.