Tuesday, 1 September 2026
  • Home  
  • SIR సర్వేపై ఇరవెండి గ్రామస్తుల ఆందోళన
- BHADRADRI

SIR సర్వేపై ఇరవెండి గ్రామస్తుల ఆందోళన

ఇరవెండి, ఆగస్టు 29: ఇరవెండి, మోతే రెండు పంచాయతీలకు కలిపి ఇరవెండి పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో SIR సర్వేలో ఓట్ల నమోదు అంశంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 40 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించినప్పటికీ సుమారు 300 మంది ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు కాలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. గ్రామసభకు బూర్గంపాడు తహసీల్దార్‌ మేడ ప్రసాద్‌తో పాటు మండల అధికారులు హాజరయ్యారు. సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఓట్ల నమోదు సమస్యపై తహసీల్దార్‌ను ప్రశ్నించారు. 2002 నాటి ఓటర్ల వివరాలను పరిశీలించి, గల్లంతైన ఓట్లను తిరిగి నమోదు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేసిన తర్వాతే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. మండలవ్యాప్తంగా ఇలాంటి పొరపాట్లు జరిగితే అర్హులైన ప్రజలు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో గల్లంతైన పేర్లపై మరోసారి సర్వే నిర్వహించి, అర్హులందరి పేర్లు నమోదు చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎట్టి లక్ష్మయ్య, మడకం కోసరామయ్య, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

ఇరవెండి, ఆగస్టు 29: ఇరవెండి, మోతే రెండు పంచాయతీలకు కలిపి ఇరవెండి పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో SIR సర్వేలో ఓట్ల నమోదు అంశంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 40 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించినప్పటికీ సుమారు 300 మంది ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు కాలేదని సీపీఎం నాయకులు ఆరోపించారు. గ్రామసభకు బూర్గంపాడు తహసీల్దార్‌ మేడ ప్రసాద్‌తో పాటు మండల అధికారులు హాజరయ్యారు. సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఓట్ల నమోదు సమస్యపై తహసీల్దార్‌ను ప్రశ్నించారు. 2002 నాటి ఓటర్ల వివరాలను పరిశీలించి, గల్లంతైన ఓట్లను తిరిగి నమోదు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేసిన తర్వాతే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. మండలవ్యాప్తంగా ఇలాంటి పొరపాట్లు జరిగితే అర్హులైన ప్రజలు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో గల్లంతైన పేర్లపై మరోసారి సర్వే నిర్వహించి, అర్హులందరి పేర్లు నమోదు చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎట్టి లక్ష్మయ్య, మడకం కోసరామయ్య, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.