విజయవాడ, జూలై 19 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జోన్ల SIR కన్వీనర్లు, రాష్ట్ర పదాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమగ్ర ఓటరు సవరణ (SIR) ప్రక్రియను 100 శాతం పూర్తి చేయడంతో పాటు పారదర్శకంగా అమలు చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
సమావేశంలో మధ్యప్రదేశ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, SIR నేషనల్ కన్వీనర్ తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి, SIR నేషనల్ కో-కన్వీనర్ రితురాజ్ సిన్హా, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోన్ల SIR కన్వీనర్లకు బాధ్యతలు అప్పగించిన నాయకులు, SIR ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులతో (BLOలు), ఎన్నికల సంఘం అధికారులతో, అలాగే కూటమి పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి దశలో సమన్వయం, కచ్చితత్వం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.



