ఆత్మకూరు
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఆత్మకూరు ఆర్డీవో బి. పావని క్షేత్రస్థాయిలో పర్య టిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఏఎస్పేట మండలంలోని పెద్ద అబ్బిపురం, అనుమసముద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఎల్ఎల పనితీరును పరిశీలించి, ఓటర్ల దరఖాస్తుల ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే దరఖాస్తులు అందుకున్న ఓటర్లు వాటిని త్వరగా పూర్తి చేసి బీఎల్దలకు అందజేయాలని ఆర్డీవో కోరారు.


