పున్నమి ప్రతినిధి వేముల(జూలై 6)వేముల మండలం స్థానిక శ్రీ శక్తి భవన్ లో డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పైన అవగాహన కార్యక్రమాన్ని వెలుగు డి ఆర్ డి ఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆంజనేయులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరుడి ఓటు అమూల్యమైనదని,మీ ఓటు మీ హక్కు, మీ బాధ్యతగా స్వచ్ఛమైన ఖచ్చితమైన ఓటరు జాబితా నిర్మాణకార్యక్రమం లో డ్వాక్రా సంఘం మహిళలు భాగస్వాములు కావాలని సూచించారు. మహిళా సంఘం కుటుంబ సభ్యుల ఓటు వివరాలను సరిచేసుకొని వెంటనే సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ లకు అందజేయాలనీ కోరారు . భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటరు జాబితాలో ఓటర్లు పేరు చిరునామా వయసు వంటి వివరాలు సరి చేసుకోవచ్చని,ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారిన వారు ఓటు బదిలీ చేసుకోవచ్చని, మరణించిన లేదా అనర్హులైన వారి పేర్లు తొలగింపు సమాచారం అందించవచ్చని డ్వాక్రా మహిళలకు సూచించారు, 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారు కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు అవసరమైన వయసు ధ్రువీకరణ పత్రం నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.మండల వ్యాప్తంగా 543 మహిళా సంఘాలు 5268 మంది మహిళలకు ,32 గ్రామ సమాఖ్యలు సోమవారం, మంగళవారం లలో మహిళలకు ప్రత్యేక సర్ అవగాహన సమావేశాలను నిర్వహించి చైతన్యం చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామాలలో గ్రామ సమాఖ్య అసిస్టెంట్ లు అప్లికేషన్ నింపడం లో మహిళా సంఘం సభ్యులకు సహకరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జయపాల్, గంగ రాజు, జ్యోతి, నాగేశ్వరి, హరికృష్ణ గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు





