నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లక్ష్మణ చారి భవన్, సిపిఐ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, రైతు బీమా లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది, ఈ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేది కానీ నేటి ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను విస్మరించడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు లేని యెడల రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి తిరుగుబాటు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు, ఆగస్టు 13న ముగిసినటువంటి రైతు బీమా ప్రీమియంను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని దురదృష్టవశాత్తు రైతులు మరణిస్తే ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు కొంత ఉపశమనం లభించేదని కావున తిరిగి ఈ సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బండి లక్ష్మీపతి, శివశంకర్, జిల్లా నాయకులు కొత్త రామస్వామి, వంకేశ్వరం శ్రీనివాసులు, హుస్సేన్, బాలపీరు తదితరులు పాల్గొన్నారు.

NGKL: కళ్యాణ లక్ష్మి, రైతు బీమా పథకాలను కొనసాగించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ డిమాండ్