Saturday, 30 May 2026
  • Home  
  • NGKL: సల్కరిపేటలో విషాదం: కట్లపాము కాటుకు పదేళ్ల బాలుడు బలి
- నాగర్‌కర్నూల్

NGKL: సల్కరిపేటలో విషాదం: కట్లపాము కాటుకు పదేళ్ల బాలుడు బలి

బిజినేపల్లి(నాగర్‌కర్నూల్): మండల పరిధిలోని సల్కరిపేట గ్రామంలో పాముకాటుతో ఒకే ఒక్క కుమారుడు మృతి చెందడంతో ఓ కుటుంబంలో తీరని శోకం వ్యక్తమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల బంగారయ్య, అంజనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు చరణ్ (10) ఉన్నారు. శుక్రవారం రాత్రి చరణ్ ఇంటి ముందు నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ కట్లపాము కాటువేసింది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు బాలుడిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.