నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) గారు గురువారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు, ఎమ్మెల్సీ శ్రీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు ,నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, వారికి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్ మహిళలకు ఒక వేదికగా నిలిచి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వివిధ శిక్షణ కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు సమాజంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈ భవనం దోహదపడుతుందని అన్నారు.
మహిళా సంఘాల అభివృద్ధి, వారి ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళల శక్తి రాష్ట్ర ప్రగతికి మూలస్తంభమని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర ,వైస్ చైర్మన్ బాదం రమేష్,టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు ,స్థానిక కౌన్సిలర్స్ ,ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.










