గుంటూరు, సెప్టెంబరు 11 (పున్నమి ప్రతినిధి): గుంటూరు పర్యటనకు విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని LVR క్లబ్‌లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, క్లబ్ అధ్యక్షులు నూకవరపు వెంకటేశ్వరరావు, కార్యదర్శి సుబ్బారావు, క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లితో వారు ఆత్మీయంగా మాట్లాడి, పలు అంశాలపై చర్చించారు.




