రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్, జూలై 6:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి సర్వర్ పాషా జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ముస్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఎద్దండి నరసింహారెడ్డి, నిరంజన్, యాదగిరి తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ఎండి సర్వర్ పాషా కు శుభాకాంక్షలు తెలిపారు.


