Saturday, 26 September 2026
  • Home  
  • 608 మందికి రూ.5.10 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్
- తూర్పు గోదావరి

608 మందికి రూ.5.10 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్

అనపర్తి, సెప్టెంబరు 26 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలో వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా అండగా నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో శనివారం 84 మంది లబ్ధిదారులకు రూ.43 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా 608 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.5.10 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య చికిత్సల సమయంలో ఈ ఆర్థిక సహాయం ఎంతో తోడ్పాటునందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.