Saturday, 4 July 2026
  • Home  
  • CEIR పోర్టల్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ
- కాకినాడ

CEIR పోర్టల్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ

*పత్రికా ప్రకటన* *CEIR పోర్టల్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ – బాధితులకు 602 మొబైల్ ఫోన్లను అందజేసిన కాకినాడ జిల్లా పోలీసులు* *రూ.1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేత* *జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ., తేదీ: 04.07.2026* *కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్* గారి ప్రత్యేక చొరవతో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా రూ.1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందజేశారు. CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, జిల్లా ఐటీ కోర్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, IMEI ట్రాకింగ్, GPS ఆధారిత ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ నిఘా, డేటా విశ్లేషణ వంటి పద్ధతులను వినియోగించి ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు నిర్వహించిన 12 విడతల్లో మొత్తం 4,603 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి మొత్తం విలువ రూ.7,68,67,000గా ఉంది. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా విశేష ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ (www.ceir.gov.in) ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొబైల్ పోయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: – బ్యాంక్ ఖాతాలు, UPI సేవలను తాత్కాలికంగా భద్రపరచాలి. – సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. – Google, Apple ID, బ్యాంకింగ్ యాప్‌లు, WhatsApp, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చాలి. – Android వినియోగదారులు Find My Device, iPhone వినియోగదారులు Find My iPhone సేవలను వినియోగించాలి. – CEIR పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలి. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు: – మొబైల్ బిల్లు, బాక్స్, IMEI నంబర్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. – అపరిచితుల వద్ద నుంచి మొబైల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలి. ఈ విజయవంతమైన మొబైల్ రికవరీలో కీలక పాత్ర పోషించిన జిల్లా ఐటీ కోర్ బృందం ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. దుర్గా శేఖర్ రెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది, డీసీఆర్‌బీ, పీసీఆర్, సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు మొబైల్ రికవరీ బృంద సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారితో పాటు అడిషనల్ ఎస్పీ (పరిపాలన) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ఎస్‌డీపీఓ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. దుర్గా శేఖర్ రెడ్డి, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. సన్నాసిరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ.

*పత్రికా ప్రకటన*

*CEIR పోర్టల్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ – బాధితులకు 602 మొబైల్ ఫోన్లను అందజేసిన కాకినాడ జిల్లా పోలీసులు*

*రూ.1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేత*

*జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ., తేదీ: 04.07.2026*

*కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్* గారి ప్రత్యేక చొరవతో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఈ రోజు నిర్వహించిన 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా రూ.1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందజేశారు.

CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, జిల్లా ఐటీ కోర్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, IMEI ట్రాకింగ్, GPS ఆధారిత ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ నిఘా, డేటా విశ్లేషణ వంటి పద్ధతులను వినియోగించి ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.

ఇప్పటివరకు నిర్వహించిన 12 విడతల్లో మొత్తం 4,603 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి మొత్తం విలువ రూ.7,68,67,000గా ఉంది. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా విశేష ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ (www.ceir.gov.in) ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అలాగే సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మొబైల్ పోయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

– బ్యాంక్ ఖాతాలు, UPI సేవలను తాత్కాలికంగా భద్రపరచాలి.
– సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి.
– Google, Apple ID, బ్యాంకింగ్ యాప్‌లు, WhatsApp, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చాలి.
– Android వినియోగదారులు Find My Device, iPhone వినియోగదారులు Find My iPhone సేవలను వినియోగించాలి.
– CEIR పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలి.

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:

– మొబైల్ బిల్లు, బాక్స్, IMEI నంబర్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
– అపరిచితుల వద్ద నుంచి మొబైల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలి.

ఈ విజయవంతమైన మొబైల్ రికవరీలో కీలక పాత్ర పోషించిన జిల్లా ఐటీ కోర్ బృందం ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. దుర్గా శేఖర్ రెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది, డీసీఆర్‌బీ, పీసీఆర్, సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు మొబైల్ రికవరీ బృంద సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారితో పాటు అడిషనల్ ఎస్పీ (పరిపాలన) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) శ్రీ ఎస్. శ్రీనివాసరావు, కాకినాడ ఎస్‌డీపీఓ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. దుర్గా శేఖర్ రెడ్డి, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎ. సన్నాసిరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

-జిల్లా పోలీసు కార్యాలయం, కాకినాడ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.