Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

Featured

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిక్కవరపుపాడు గ్రామంలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి పోకుండా తిరిగి ముందుకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది. నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ఉప ఆరోగ్య కేంద్రాలతో గ్రామస్థులకు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడకుండా సిమెంటు రోడ్లు, డ్రైన్లు మొదలగు నిర్మాణాలను చేపడుతున్నాం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్ని ఇంటి ముంగిటకే చేర్చే ప్రక్రియను తీసుకొని వచ్చాము.వాలంటీర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించి, వాలంటీర్ల వ్యవస్థ పై విమర్శలు చేసిన వారి నోళ్లకు తాళం వేశారు.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా గత 5 సంవత్సరాలలో చేయలేకపోయిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారంలోని 5 సంవత్సరాలతో కలిపి 10 సంవత్సరాల అభివృద్ధిని అందిస్తా.2 సార్లు శాసన సభ్యునిగా అవకాశం ఇచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Featured ఆంధ్రప్రదేశ్

రేపు, ఎల్లుండి ఏపీలో జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు

రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పటికీ, రేపటి(21 మే 2020) నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి మే 24వ తేదీ వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వచ్చే 48 గంటలు తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డి) స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా రెంట చింతలలో మూడు రోజులుగా తన ప్రభావం చూపిస్తున్నాడు సూర్యుడు.. ఈ ప్రాంతంలో ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా చెప్పారు. రాబోయే రెండు రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు చేసింది. పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. తుని, బాపట్ల, కావలి, కాకినాడ, మాచిలిపట్నం, నర్సాపూర్ మరియు జంగమహేశ్వరపురం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5- 6 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. అదేవిధంగా, నెల్లూరు, కడప, అనంతపురం, ఒంగోల్, విజయవాడ, కర్నూలు మరియు తిరుపతిలలో మిడిల్ హీట్ వేవ్ పరిస్థితులు కనిపిస్తాయి.

Featured

కంటైన్మెంట్ జోన్స్ మినహా తీసేందుకు అనుమతి

  పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నెల్లూరు జిల్లా కేంద్రంతో ఇతర ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్స్ దుకాణాలు తీసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి జారీ చేస్తునట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మాత్రం 6 నుంచి 9 వరకు మాత్రమే అనుమతి జారీ చేస్తున్నామన్నారు.

Featured Others

పది

దేవుడు ఒక్కడే – మానవుడే మాధవుడు మానవునికి లోకంలో మంచి-చెడు రెండే మంచి, చెడులను నిర్దేశించే మనసు, వాక్కు, చూపులే త్రిమూర్తులు ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలే నల్దిక్కులు జీవనానికి అవసరమైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలు మానవ జీవితంలోని ప్రేమ, సంతోషం, దుఃఖం, బాధ, ఓదార్పు, స్నేహమే షడ్రుచులు మానవ జీవితం రంగులమయం అవే సప్తవర్ణాలు నల్దిక్కుల ఆధారాలు-అష్టదిక్పాలకులు మానవుని జీవితదశను నిర్దేశించే గ్రహాలు-నవగ్రహాలు ఈ తొమ్మిదింటిని తనలో ఇముడ్చుకున్న దశవతారమూర్తే భగవంతుడు మానవుడే మాధవుడుమానవసేవే మాధవసేవనావూరు. హరి,ఉపాధ్యాయులు వెంకటగిరి.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్తగా 45 కరోనా కేసులు

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ..41 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.నిన్న ఒకరు మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది.కొత్తగా వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2452కి చేరింది. ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉండగా..1680 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల నుంచి పూర్తి వేతనం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ ఏపీ ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతమే చెల్లించారు.గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.కాగా అటు ఉద్యోగులకు జీతాలు కట్ చేయడంపై హైకోర్టులో ఒక ఉద్యోగి పిటిషన్ వేయగా..దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

Featured జాతీయ అంతర్జాతీయ

పట్టు తప్పుతోంది, సామాన్యుల నడ్డి విరగబోతుంది 

పున్నమి ప్రతినిధి. షేక్ రసూల్ అహమద్ : భారతదేశంలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఏప్రిల్ 21 నాటికి దేశంలో ఇవి 18,985 మాత్రమే ఉండగా, మే 20 నాటికి 1,06,750 కేసులకు పెరిగాయి. ఇలా లక్షకు పైగా కేసులు దాటిపోతున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతదేశం కరోనా సంక్రమణ దశలో అడుగుపెట్టి  కోవిడ్-19 హాట్ స్పాట్ గా మారిపోయింది. ఈ నెల 7 నుంచి ప్రతి రోజూ సుమారు 3,200 కేసులు నమోదవుతూ వచ్చాయి. 11 వ తేదీ నుంచి ఇది సుమారు  3,500 కు పెరగగా, గత నాలుగు రోజుల్లో ( మే 17 నుంచి 20 వరకు ) రోజుకు 4,950 కేసులకు పెరిగింది. ఇక నిన్న ఒక్క  రోజే కొత్తగా 5,611 కేసులు నమోదయ్యాయి. ఇంతటి మహా సంక్షోభం నుంచి ఎలా బయటపడాలని గాని, కరోనాను ఎలా కట్టడి చేద్దామని గానీ కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ ప్రయత్నం రెండూ లేవు. గతంలో రోజూ సమీక్షలు నిర్వహించే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత 8 రోజులు నుంచి  వీటికి స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. భారమంతా రాష్ట్రాలపై వేసి చేతులు దులుపుకొంటుంది. చివరిసారి ఈ నెల 11 న హెల్త్ మినిస్ట్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. తర్వాత  మీడియాతో ఏ విధమైన కాంటాక్ట్ పెట్టుకోలేదు. దీనిపై అన్నివైపులా  విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్  మాట క్రమేపీ పాతబడిపోతోంది, బహుశా కరోనా వైరస్ తో  సహజీవనం చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచనలాగా కన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో సమన్వయము లేకుండా అంతర్జాతీయ మెప్పు కోసమంటూ విశ్లేషకులకు సైతం అర్ధంకాని ఉద్దీపన చర్యలు చేపట్టి ప్రజా రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలగించివేసింది. రైళ్లు, బస్సులు, విమాన రాకపోకలపై నిషేధం ఎత్తి వేస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెంది వివిధ సమస్యలు తలెత్తే పరిస్థితులను అందరూ ఎదుర్కోవలసి వస్తుంది. ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉండి హావ్స్, హావనాట్స్ అంతరం మరింతగా పెరిగి భవిష్యతులో తీవ్ర అంతర్యుద్దాలకు దారి తీస్తోందా అన్న అనుమానాలు బీజం పోసుకొంటున్నాయి. పోనీ ఏదోరకంగా కేంద్ర ఆదుకొంటుంది అనుకుంటే, భారీ ప్యాకేజి అంటూ ఊరించి చివరికి వలస కార్మికుల, సామాన్యుల చేతిలో చిప్పలు పెట్టారని ప్రజలు వాపోతున్నారు. ఇంతటి లాక్ డౌన్ లోనే కరోనా విజృంభిస్తూ వుంటే  ఇక ముందు ముందు ఎలావుంటుందో ఊహించడానికే భయమేస్తుంది. కాని ప్రభుత్వం మాత్రం దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెపుతూ  ఏ విధంగానైనా లాభాలు గడించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పటిలాగే మరొక్కసారి సామాన్య ప్రజలే సమిధలవుతారని చరిత్ర చెప్పకనే చెపుతుంది.

Featured

మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ వారి నిరంతర సేవలు 

గూడూరు మే 21, 2020 (పున్నమి ప్రతినిధి – షేక్. రసూల్ అహమద్ ) : లాక్ డౌన్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు వుండే 150 ముస్లిం కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 కిలోల బియ్యం, ఒక చీర చొప్పున మొహమ్మద్  ఫక్రుద్దీన్ చారిటబుల్  ట్రస్ట్ వారు పంపిణి చేశారు. గురువారం నాడు గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట, బనిగి సాహెబ్ పేట, సాధుపేట, చిన్న చేపల మార్కెట్ వీధి నందు, ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా ఇంటింటికీ వెళ్లి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. అందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రభుత్వ సూచనలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అందించడం జరిగిందని అన్నారు. అలాగే ట్రస్టుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న మిత్రులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు. సంస్థ గౌరవ సలహాదారులు షేక్.గౌస్ బాషా మాట్లాడుతూ మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని, రంజాన్ పండుగ సందర్భంగా  కరోనా మహమ్మారి దూరమై అందరూ సుభిక్షంగా ఉండాలని అల్లాను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఫౌండర్ మగ్ధుమ్, సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ సర్తాజుద్దీన్, గౌరవ అధ్యక్షురాలు సఫ్నాజ్, ఫరీనా, గౌరవ సలహాదారులు గౌస్ బాషా, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి యాసీన్, కోశాధికారి అమృద్దిన్, సభ్యులు అయాజ్, సమద్, అలీం తదితరులు పాల్గొన్నారు.

Featured

కరోన విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ విషయంలో ప్రజలను ఇబ్బందులు గురి చేయడం తగదు బిజెపి జిల్లా నేత బోలా

మనుబోలు 21-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్ ) మనుబోలు మండలం కాగితలపూర్ హరిజన వాడ కు చెందిన జోగి అశోక్ ఇటివల ఆత్మహత్యాయత్నం కు పాల్పడిన విషయం లో ఆయనను పరామర్శించి అందుకు గల కారణాలను మనుబోలు మండల బిజెపి పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు.బ్యాంకు పొదుపు లోను విషయంలో బ్యాంక్ అధికారులు మరియు బాధితుడు జోగి అశోక్ కు మధ్య జరిగిన విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు కరోనా కష్టకాలంలో లోన్లు విషయంలో ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు లోన్లు విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ బ్యాంక్ అధికారులు వేధించడం తగదన్నారు .ఈ సమస్య విషయంలో బిజెపి నాయకులు అందరం మాట్లాడుకొని అవసరమైతే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయి అశోక్ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చేయాలని అందరం కలిసి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు ముప్పవరపు చిన్న బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పట్నం వీర ప్రతాప్ నాయకులు భూపతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కలు

విద్యుత్ బిల్లుల కాకిలెక్కలు వినియోగదారుల బిల్లులకు రెక్కల ఏప్రిల్ 2020 నుండి ఏపీ ఈఆర్సీ పెంచిందని చెప్పబడుతున్న విద్యుత్ కాకి లెక్కలు మరోసారి వినియోగదారులపై ఎలా భారం వేసేందుకు కుట్ర జరిగిందో తేటతెల్లమవుతుంది. బిల్లులు సరి చూసుకోండి అన్న లింకు చూస్తే ఇంకా బొక్కలు కని పించాయి. ఉదాహరణకు నా సర్విసుకు సంబంధించిన బిల్లు వివరాలు ఏప్రిల్ 2020 లో 30 రోజులు మే 2020లో 30 రోజులు అని చూపి ఉంది. వాస్తవానికి గత మీటరు రీడింగు మార్చి2020 నెల 6వతేదీన తీసారు. మరలా మేనెల 14న తీసారు.(కోవిడ్ వలన అని ఎంత చెప్పినా రీడింగు ఆలశ్యంగా తీయడం రివాజు.ఒక సారి నాలుగురోజులు ఐదు రోజులు ఆలశ్యం సాధారణంగా జరిగేదే.నష్టం వినియోగదారునికే) అంటే 70 రోజుల వినియోగాన్ని 60 రోజులకు చూపి స్లాబులు తారీఫులు పెంచడం ఒక తప్పు. మార్చినెల 25 రోజులకు పాత తారీఫు వర్తించాలి. కానీ ఏప్రిల్ నెలలో 17 రోజులకు పాత తారీఫు చూపి మిగిలిన దంతా కొత్త తారీఫులో చూపడం మరో మోసం. 70 రోజుల వినియోగాన్ని విభజించి రోజు ఆవిధంగా 30 రోజులకు నిర్ణయించి స్లాబు ఫిక్స్ చేస్తే వినియోగదారునికి ఊరట. కానీ అది జరగలేదు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నరోజుల్లో సాఫ్ట్వేర్ మార్చి ప్రపోర్షనేట్ బిల్లింగ్ వేస్తే ఏమన్నా ఇబ్బందా. వినియోగదారులకు పారదర్శకత లేని బిల్లులు వేసి మొండిగా పెంచలేదని చెప్పటం మూర్ఖత్వం కాక మరోకటిలేదు. అసలే కష్టకాలంలో ఉన్న ప్రజలపై ఇటువంటి భారాలు వేయడం ప్రజాహితమా…అందునా మోసపూరితమైన బిల్లును వేసి మొండిగా వాదించడం సహేతుకం కాదు. జూన్ 30 దాకా సమయం ఉంది కట్టొచ్చు అని చెప్పటం మరో భూటకం.బిల్లుల్లో యధాతధంగా డిస్కనెక్షను తేదీని ఇచ్చారు. జూన్ బిల్లు కలిపి ఇంకో మోపు పెనాల్టీ లు వేసి ఇంకా ప్రజాగ్రహానికీ గురౌతారు. ఏదో ప్రతిపక్షాలు చేసే గలభాగా దీన్నిచూపడం అసమంజసం. ప్రతిపక్షాలు పూర్తిగా విశ్లేషించి తమ వాదనలూ వినిపించడంలేధనేది ఇపుడు టీవీ చర్చల్లో స్పష్టంగా తెలుస్తూంది. మరో విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం బిల్లును సిధ్ధం చేసింది. అది ఇంకా రాష్ట్రాలపాత్రను తగ్గించి రాజ్యాంగ మూలస్థంభమైన ఫెడరల్ విధానంకి భిన్నంగా ప్రత్యక్ష ధన మార్పిడి పేరుతో మరో భారాలకు సిద్ధమౌతుందీ. జీఎస్టీకి తలూపిన ఈ పార్టీలు ఇపుడు కేంద్రం ముందు భిక్షగాళ్ళుగా మారేట్లు చేసిందానికి ప్రజలు బాధలు భరిస్తున్నారు. రాష్ట్రాల ప్రజల పై భారాలువేసేవాటికి ముద్దుగా సంస్కరణలని పేరెట్టి ఉద్దీపన అనే ఓ కాకి లెక్కల ప్యాకేజి లో కేంద్ర ఆర్ధికమంత్రి గారు.సెలవిచ్చారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ వినియోగదారుల భారాలను తగ్గించాలి. వినియోగం పెరిగి బిల్లులు పెరిగాయనడం పచ్చి అబద్ధం. యూనిట్లు కొన్నిచోట్ల పెరిగి ఉండొచ్చు. మీ విద్యుత్ బిల్లులలో లోపించిన పారదర్శకత…ఆలశ్యంగా రీడింగు తీస్తే అవసరమైన సాఫ్ట్వేర్ మార్పు…కరోనా కష్టకాలంలో అసలే జీతాలు ఆదాయం మృగ్యమై యున్న వినియౌగదారులపై భారాలు మోసి లేదని మూర్ఖంగా వాదించడం…ఎంత వరకూ సమంజసం. మీకెవరైనా మిస్ లీడ్ చేస్తున్నారేమో ఆలోచించాలనీ రాష్ట్ర నేతకు విజ్ఞప్తి. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆలోచించకపోతే గత ప్రభుత్వాలకు లభించిన బహుమతి ప్రజలవద్దనుండి లభిస్తూంది. అందుకే పెంచిన బిల్లులు రివైజ్ చేయండి. ఆవరకూ పారదర్శకంగా బిల్లులు పెంచిన.తారీఫు ప్రక్కన పెట్టి ఆఖరి తేదీ లోపు ఎటువంటి పెనాల్టీలు లేకుండా ప్రజలవైపు కష్టాలలో అండగా నిలబడాలనీ అపుడే ప్రజలు హర్షిస్తారనీ..లేకపోతే కరెంటు షాకిచ్చిన ప్రభుత్వాలకు ఎటువంటి సమాధానాలు జనాలు ఇచ్చారో…విద్యుత్ బిల్లులు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం కు ఏవిధమైన మద్ధతు ఇచ్చారో నేతలు గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. ఇట్లు ఓ వినియోగదారుడు జీవి నాగరాజ రావు బీ.యస్సీ ఎల్లెల్బీ