Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

అనంతపురం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిత్యావసర వస్తువుల పంపిణీ

లాక్ డౌన్ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన సొంత గ్రామం అయినటువంటి కర్నూలు జిల్లా పసుపుల రుద్రవరం లో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 కేజీల బియ్యం 1కేజీ కంది బ్యాలు 7 రకాల నిత్యావసర వస్తువులను పసుపుల మాజీ సర్పంచ్ అయినటువంటితన తల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 550 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది తాను ఎంత ఎత్తు ఎదిగిన తాను పుట్టిన గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునికరోనా నేపథ్యంలో తమ గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకుని పంపిణీ చేసేందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Featured

లాక్ డౌన్ లో ఆకలికి అలమటిస్తూ వున్న వారి పొట్ట నింపుతున్న మనసున్న మహానుభావులు

24.04.2020, నెల్లూరు,(పున్నమి ప్రతినిధి – సి.యస్.రావు ) *లాక్ డౌన్ లో ఆకలికి అలమటిస్తూ వున్న వారి పొట్ట నింపుతున్న మనసున్న మహానుభావులు* పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా తిండి తిప్పలకు అల్లాడుతున్న బిచ్చగాళ్లను, వలస కూలీలును , నేషనల్ హైవే పై పలు రాష్ట్రాలకు జిల్లాలకు వెళ్తున్న కూలీలు ఇతరులకు 40 రోజులుగా వంద మందికి టిఫిన్ , భోజనం మంచినీరు అందజేస్తూ ,వారి ఆర్థిక స్థితి గురించి కూడా పట్టించుకోకుండా, మానవత్వంతో ఆలోచించి సేవ చేస్తూ సేవ చేసిన విషయం కూడా ఫోటోలు వీడియోలు తీయకుండా మాధ్యమాల్లో ప్రచారం చేసుకోకుండా సేవ చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు చేజర్ల సుధాకర్ రావు గుర్తించి , ఆ రెండు కుటుంబాల వారు ఆటోలో ఫుడ్ తీసుకువచ్చి అన్నం పెడుతూ ఆకలి తీర్చుతున్న , తోటి వ్యక్తుల ఆకలి బాధను అర్థం చేసుకుంటూ సేవ చేస్తున్న వేణు గోపాల్ వర్మ -శేష శైలజ, సునీల్ – లక్ష్మీ గార్లను ఘనంగా అభినందించారు. ఈ రోజు కూడా నేషనల్ హైవే లో వెళ్లే వలస కూలీలకు ,అయ్యప్ప గుడి దగ్గర ,ఆత్మకూరు బస్టాండ్ పరిధిలోని సాయి బాబా గుడి దగ్గర ఉన్నవారికి ఉదయం 9 గంటలకు టిఫిన్ అంద చేయడం జరిగింది. కరోనా కోవిద్ 19 కారణంగా పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడుతున్న వారి ఆకలి తీరుస్తూ ప్రచార ఆర్భాటాలు దూరంగా ఉంటూ సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించే దానిలో భాగంగా వీరిని అభినందించడం జరిగిందని ఆయన అన్నారు.

Featured

ఆందోళన చెందకండి అండగా నేనున్నా..కాకాణి భరోసా

24-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ మరియు గమళ్లపాలెం నందు తన సొంతనిధులతోకూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయనకు ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈ కరోన మహమ్మారి వచ్చనప్పటినుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూసహాయసహకారాలుఅందిస్తున్నారు మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి ఈ రోజు మనుబోలులో సొంత నిదులతో వారము నకు సరిపడా కూరగాయలు,గుడ్లు పంపిణీ చేసినారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనుబోలు లో కరోనా పాజిటివ్ కేసు వచ్చినప్పటినుంచివాళ్లకు కావలసిన కూరగాయలు నిత్యవసర వస్తువులు ఇంటిదగ్గర కే అందజేస్తున్నాము కంటోన్మెంట్ జోన్ లో ఉంది కావున ప్రజలు రాకపోకలు చేసే వీలు లేదు కనుక వాళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులు మందులు మొదలైన వాటికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఒక అధికారిని ఏర్పాటు చేశాము జాతీయ రహదారి పక్కన ఉండే గ్రామాల కనుక కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకున్నాము అని తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి , జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు దాసరి భాస్కర్ గౌడ్ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,అన్నమాల ప్రభాకర్ రెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,కుడుముల వెంకటరమణయ్య గౌడ్, కోటేశ్వర్ గౌడ్ , దాసరి మహీంద్ర వర్మ చల్ల రవీంద్ర ,నవకోటి,దయాకర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Featured

గుంజి రమేష్ ఆధ్వర్యంలో గోవిందరాజపురం గ్రామం లో చారిత్రాత్మక విజయం సంవత్సరం ఐన సందర్భంగా వేడుక

23-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంవత్సర కాలం పూర్తైన సందర్బంగా ఆనందోత్సాహలలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేసిన నాయకులు ఏడాది క్రితం ఈ రోజు రాష్ట్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు రెండవ సారి శాసన సభ్యునిగా సర్వేపల్లి నియోజక వర్గం నుండి గెలిచిన కాకాణి గోవర్దన్ రెడ్డి గారు. నియోజక వర్గానికి రాష్ట్ర స్థాయిలో పేరును తెచ్చిన ప్రజా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజసేవలో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు వచ్చే సంవత్సరానికి కాకాణి గారు మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకాణి గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలని కోరుకుంటున్నాము,అలాగే మన గౌరవననీయులుశ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సి ఎం గా మన అందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకోండూరు పంచాయతీ గోవిందరాజుపురంగ్రామంలో సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుంజి రమేష్ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో గుత్తికొండ బ్రహ్మయ్య, బిట్ర హరి ,మాడా రామక్రృిష్ణ బ్రహ్మయ్య సుమంత్ పాల్గొన్నారు.

Featured

చారిత్రక విజయానికి ఏడాది

మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) సర్వేపల్లి నియోజకవర్గం యం.ఎల్.ఏ ప్రజా నాయకుడు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యులు అవ్వి ఈ రోజుకు ఒక సంవత్సరం ఐనది వచ్చే సంవత్సరం నకు కాకాని గారు మంత్రి గా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ కాకాని గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలనికోరుకుంటున్నాము.అలాగే మన గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు CM గా అవ్వి మనఅందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకొండూరు పంచాయితీ లో జ్యోతి నగర్ కాలనిలో ఆవుల తులసిరామ్ యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కడివేటి చంద్ర శేఖర్ రెడ్డి చేతులు మీదగా కేక్ కట్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో జ్యోతి నగర్ గ్రామ ప్రజలు మాస్కులు తో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు.

Featured

మిత్రుల ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహారం పంపిణీ

మనుబోలు 23-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతూ సుదూర ప్రాంతాలకు కాలి నడకన వేలుతున్న వలస కూలీలకు మేమున్నామని మనుబోలు గ్రామానికి చెందిన మిత్రులు నీలిశెట్టి రవిచంద్ర,నీలిశెట్టి వెంకట కృష్ణ, మద్దాలి సాయి వినోద్ కుమార్,షేక్ జాకీర్ కలసి రోడ్డు వెంబడి వెళ్తున్న వలస కార్మికులకు మరియు లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ,వైద్య సిబ్బంది ఎంపీడీఓ,తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందికి భోజనాలు మరియు పెరుగన్నం పంపిణీ చేసారు. మిత్రులు మాట్లాడుతూ యిలాంటి ఆపత్కర పరిస్థితుల్లో తమ వంతు సాయంగా అందచేస్తున్నాము అని తెలిపేరు.

Featured

కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి అనిల్ సమీక్ష సమావేశం

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పోలుబోయిన అనిల్ కుమార్,కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు కరోనా నివారణ చర్యలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రెండోసారి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Featured

నెల్లూరు జిల్లాలో మహిళ రోడ్డు ప్రమాదం…

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నాయుడు పేట వైపు నుండి గూడూరుకి వెళ్తున్న బైకును లారీ వెనక నుండి ఢీకొనడంతో బైక్ వెనక కూర్చొన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ తోలుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికులు అతనిని 108 వాహనంలో గూడూరు ఏరియా హోస్పీటల్ కి తరలించారు.

Featured

లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణ లను ప్రభుత్వం ఆదుకోవాలి

మనుబోలు 22-05-2020 (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) లాక్డౌన్ తో మనుబోలు మండలం లోని400 విశ్వబ్రాహ్మణ కుటుంబాలు చితికి పోయినవి ఉపాధి లేక పస్తులు తో అల్లాడుతున్నారు వారిని ఆదుకోవాలని మనుబోలు మండలం విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు కోరినారు ఇ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కి ఎంపిడిఓ కి వినతిపత్రం ని సమర్పించారు ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు,అధ్యక్షుడు రాము ఆచారీ ప్రభాకర్ రవి చైత్యన్య అమరేంద్ర ఆచారీ తదితరులు పాల్గొన్నారు.

Featured

నెల్లూరు నగరంలో రేపటి నుంచి దుకాణాలకు అనుమతి

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ ✍️ లాక్ డౌన్ నేపధ్యంలో నెల్లూరు నగర వ్యాప్తంగా మూతపడిన వ్యాపార వాణిజ్య రంగాలకు ఉపశమనం కల్పిస్తూ శుక్రవారం నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునేలా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ టి.బాపిరెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉదయం 7గం నుండి సాయంత్రం 7 గంటల వరకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.