Thursday, 9 July 2026

Blog

ఆంధ్రప్రదేశ్

‘తోటపల్లి’ సైఫూన్ బీటల పరిశీలన

పాలకొండ : మండలంలోని మల్లివీడు వద్ద గల తోటపల్లి ప్రధాన కాలువ సైఫూన్ కు పడిన బీటలను తోటపల్లి సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఖరీఫ్ కు సాగు నీరు కష్టమేనని పేర్కొన్నారు.  వెంటనే మరమ్మతులు చేపట్టాలని,  లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Featured

వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం

వెంకటేశ్వర ఆలయంలో ధన్వంతరి యాగం పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి ): పలమనేరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని తిరు వెంకట నగరిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నందు జ్యేష్టాభిషేక పూజలను అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధన్వంతరియాగము ,సుదర్శన్ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి చేసి మంగళ హారతులతో స్వామి వారి యాగాన్ని పరిసమాప్తం చేశారు. పవిత్ర కలశాల్లోని జలాలను శ్రీచక్ర ఆళ్వార్లకు నాగదేవతలకు కుంభ అభిషేకాన్ని నిర్వహించి పూజలను ఘనంగా జరిపారు. సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలతో ఆలయ అర్చకులురంగనాథ ఆచార్యులు ధర్మకర్తల కమిటీ కొద్దిమందితో మాత్రమే పూజా కైంకర్యాలను నిర్వహించారు అనంతరం రంగనాథ ఆచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో నిర్మించిన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూని పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి వారి సహాయ సహకారానికి గ్రామస్తులు తరఫున ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు

Featured

అప్రమత్తత అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

శ్రీకాకుళం :  అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పి ఆర్ఎన్ అమ్మిరెడ్డి  పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ సమీక్ష సమావేశాన్ని శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై సైబర్ క్రైమ్  అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు, ఫిర్యాదుదారుడికి భరోసా కల్పించేలా దర్యాప్తు చేయాలన్నారు,  సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.అప్రమత్తత అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

Featured

తర్లుపాడు మండలం లో మహిళ ఉరి వేసుకొని మృతి

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన బోగెం నాగమణి అనే మహిళ ఉరి వేసుకొని అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నట్లు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తాడివారిపల్లి ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు వారి సిబ్బంది వాహనంలో సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పరిశీలించి చనిపోవడానికి గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భోగెము నాగమణి అనే మహిళ రాత్రి 11 గంటల సమయాన ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యనా అని తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి మీనిగ లక్షమ్మ పిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని పరిశీలించామని ఈమెకు భర్త చెన్నకేశవులు, అబ్బాయి, అమ్మాయి ఉన్నారని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ సత్యం, వీఆర్వో రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

Featured చిత్తూరు

నేటి నుంచి రవాణా శాఖలో సేవలు యధాతథం

నేటి నుంచి రవాణా శాఖలో సేవలో యథాతథం పలమనేరు మే31 2020(పున్నమి విలేకరి సుదర్శన్):పలమనేరు ప్రాంతీయా రవాణా శాఖ కార్యాలయం నందు వాహనదారులకు సేవలను సోమవారం నుండి ప్రారంభం అవుతాయని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కరోనా వైరస్ వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధన మేరకు లాక్ డౌన్ విధించడంతో కార్యాలయంలోని సేవలను తాత్కాలికంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిలిపివేయడం జరిగిందన్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూన్ ఒకటో తారీకు నుండి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించి సిబ్బంది కూడా సహకరించాలని ఆయన కోరారు. వాహనదారులు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్, వెహికల్ ట్రాన్స్ ఫర్, రెన్యువల్ తదితర సేవలను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Featured

*_ కాణిపాకం ఆలయ ఈవోగా వెంకటేష్ _*

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ కాణిపాకం ఆలయ ఈవోగా వెంకటేష్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్ట్ రావురు యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను కాణిపాకం ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రెండు మూడు రోజుల్లో వెంకటేష్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Featured చిత్తూరు

ప్రేమ ఒక్కరితో… పెళ్లి మరొకరితో

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో. పలమనేరు మే31,2020(పున్నమి విలేకరి సుదర్శన్): పలమనేరు నియోజకవర్గంలో ఒక పాస్టరు 6 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ప్రేమించి గర్భం చేసి, తీయించేసి,వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని జంగాల అగ్రహారం గ్రామంలో ఫాస్టర్ రాజకుమార్, అదే ఊరుకు చెందిన ధనలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, అమ్మాయిని గర్భవతి చేసాడు, మాయమాటలు చెప్పి కడుపు తీయించేశాడు,ఏళ్లుగడిచినా ఏదో కుంటి సాకులు చెబుతూ కాలం వెళ్లదీసి, విషయం పెద్దలదాక వెళ్లిన తరుణం లో 6 నెలల తరువాత తన పాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఇప్పుడు వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన గ్రామానికి తీసుకురావడంతో ధనలక్ష్మి బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని పాస్టర్ రాజ్ కుమార్ మీద పిర్యాదు చేయడం తో బైరెడ్డిపల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Featured చిత్తూరు

మామిడి తోటను ధ్వంసం చేసిన ఏనుగులు

మామిడి తోటను ధ్వంసం చేసిన ఏనుగులు పలమనేరు మే31 2020,( పున్నమి విలేకరి సుదర్శన్):పలమనేరు రూరల్ మండలంలోని బేరుపల్లి గ్రామానికి చెందిన రైతు కొండారెడ్డి కి చెందిన 12ఎకరాల మామిడి తోటపై వరుసగా వారం రోజులుగా ఏనుగులు గుంపు రాత్రి సమయంలో మామిడి తోటలోనికి ప్రవేశించి మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి పొలానికి వేసిన నీటి పైపులను సైతం వదలక పూర్తిగా ద్వంసం చేసి చాలా నష్టం పరిచాయిని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.ఈ మామిడి పలసాయంతోనే వీరి కుటుంబసభ్యులకు జీవనాధారం. రైతు పొలములో ఇల్లు నిర్మించుకుని కాపురమున్న . ఆ ఇంటి వద్దవరకు మామిడి చెట్లను ద్వంసం చేస్తున్నాయన్నారు. రైతులు పంటపొలాలవద్ద వుండటానికి కూడా భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం పంటలకు అష్టకష్టాలుపడి లక్షలాది రూపాయలు అప్పులుచేసి పంటలపైనే ఆదారపడే రైతులపరిస్ధితి. ఏనుగులవలన పంట పలసాయం పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే అటవి సమీపాన గల ప్రాంతాలకు ఏనుగులు రాకుండా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసి, పంట నష్టమైన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Featured ప్రకాశం

దర్శి వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ

      దర్శి, మే31, 2020(పున్నమి విలేఖరి): దర్శి పట్టణంలో మాజీ మంత్రివర్యులు శ్రీ శిద్దా రాఘవరావు, వారి శ్రీ మతి శిద్దా లక్ష్మీ పద్మావతి పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం ఉదయం దరిశి కురిచేడు రోడ్డు లోని శ్రీ షిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమం లోని వృద్ధులకు టిఫిన్, చీరలు, పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వారి ప్రతినిధి మండాది సుబ్బారావు, వారి శ్రీ మతి మండాది జ్యోతి, వారి కుమారుడు మండాది లోకేష్, కుమార్తె వైష్ణవి మరియు బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Featured

త్రాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపండి.

31-05-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బచ్చిరెడ్డిపాలెం మండలం ఇస్కపాలెం గ్రామ పంచాయితీలో షుమారు 20 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం మండలంలో ఉన్న పలు నిరుపేద గిరిజన కుటుంబాలకు పోలినాయుడు చెరువు గ్రామంలో ఇళ్లస్థలాలను మంజూరు చేశారు. కానీ 20 సంవత్సరాలు నుండి ఆ గ్రామం అభివృద్ధికి ఆమడదూరములో ఉందని, నేటికి ఈ ప్రాంత గిరిజనులు త్రాగునీటికోసం షుమారు కిలోమీటర్ దూరం వెళ్లి పడిగాపులు కాసి త్రాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నేటికి ఉంది. ఈ గ్రామంలోని కొన్ని కుటుంబాలలో ఎటువంటి చేయూతను అందించే కుటుంబ సభ్యులు లేని వృద్దులు, వికలాంగులు త్రాగునీటి కష్టాలు పరమాత్ముడికి ఎరుక. నేడు దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న సందర్భములో ఈ ప్రాంత వాసులు త్రాగునీటికోసం ప్రతీరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఈ సమస్యపై గతపాలకులు ఇచ్చిన వాగ్దానాలన్ని నీటి మీద రాతలువలె మిగిలిపోయాయి. ఎన్నో సంవత్సరాలు నుండి పల్లప్రోలు దగ్గర మలిదేవి వాగు కట్టపై మోటార్లు వేసి అక్కడనుండి షుమారు 3కిలోమీటర్ల దూరం పైపులైన్ ద్వారా ఈ నీటిని పోలీనాయుడు చెరువు గిరిజన కాలనీకి త్రాగునీటి అవసరాలకోసం తరలిస్తుండేవారు. ఈ మధ్యకాలంలో పల్లప్రోలు గ్రామంలో పెరిగిన జనాభా దృష్ట్యా త్రాగునీటి అవసరాలకొరకు ఈ తరలించే నీటిలో ఎక్కువ శాతం త్రాగునీరు పల్లాపల్లి గ్రామంలోనే వినియోగిస్తున్నారు. కాగా మిగిలిన అరాకొర నీటితో ఈ గిరిజన కాలనీ వాసులు తీవ్ర త్రాగునీటి ఎద్దటిని ఎదురుకొంటున్నారు. గత రెండు నెలల క్రితం త్రాగునీటిని సరఫరా చేసే పైపులైన్ మరమ్మత్తులకు గురికావడంతో సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం మండల MPDO డి.వి.నరసింహారావు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన పైపులైన్ మరమ్మత్తులు చేయించారు. కానీ ఆ ప్రయత్నం తాత్కాలికంగా పరిష్కారం చూపగలిగిందే కానీ శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. ఇప్పటికైనా పాలకులు అధికారులు ఈ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టి శాశ్వతమైన మంచినీటి సదుపాయాన్ని కల్పించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుడు బూదూరు కుమార్ మరియు ఇక్కడి గిరిజన వాసులు కోరుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.