Friday, 10 July 2026

Blog

Featured Others

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవము

  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నెల్లూరు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారిని జిల్లా కార్యాలయం నందు సేవలందిస్తున్న మహిళ అధికారులు ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీ కమల్ కిరణ్ గౌరవ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా నిజాయితీ కలిగిన మంచి అధికారిణిని డాక్టర్ సుజాత గారిని మహిళా దినోత్సవ సందర్భంగా సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని ఎపి హంస అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత గారి చేతుల మీదుగా ఆఫీసు నందు సేవలందిస్తున్న మహిళా అధికారులు మహిళా ఉద్యోగులు అందర్నీ ఘనంగా సత్కరించి గుర్తింపు పొందిన సంఘముగా ఏపీ హంస ఓక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖలో మహిళా అధికారులు ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉండేందుకు ఏపీ హంస అసోసియేషన్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి కనక రత్నం, డిపిఎమ్ఓ డాక్టర్ రమేష్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, ఎన్ఆర్సి నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివరాముడు,జిల్లా ఎపిడిమిక్ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్, రిటైర్డ్ మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, ఏపీ హంస జిల్లా ట్రెజరర్ మజార్, గౌరవ సలహాదారులు అరవ పరిమళ, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు మురళి, నాగరాజు, జిల్లా మహిళా వింగ్ సెక్రటరీ సుకన్య, ఇందుకూరు పేట తాలూకా ప్రెసిడెంట్ అరుణ రాణి, జిల్లా నాయకులు జయ శ్రీ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ప్రాజెక్టు ఓనర్ ఎవరు..? గొయ్యిని పూడ్చే బాధ్యత ఎవరిది..?

శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి అధీనంలో ఉందని, ఓనర్ ఎవరని  ప్రశ్నించారు. ఇప్పటికీ ఓ స్పష్టత లేదని ఏపీ సమాధానం చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణను ఎవరు చూస్తున్నారని అనిల్ జైన్ ప్రశ్నించగా.. తామే చూస్తున్నామంటూ ఏపీ బదులిచ్చింది. అలాంటప్పుడు డ్యామ్​పై పూర్తి బాధ్యత మీది కాదా? అని అనిల్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ చూసే వాళ్లే డ్యామ్​కు ఓనర్​ అన్న విషయం తెలియదా? అని మండిపడ్డారు. శ్రీశైలం ఓనర్​గా ఆ ప్రాజెక్ట్​ సీఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఓనర్​గా నల్గొండ సీఈలు ఉండాలని తేల్చి చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెట్రాపాడ్స్​తో గొయ్యిని పూడ్చండి శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్​పూల్​లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్​తో పూడ్చాల్సిందిగా ఎన్​డీఎస్​ఏకి తెలంగాణ ఈఎన్​సీ జి.అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జియోలాజికల్ స్టడీస్​, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేలా ఏపీని ఆదేశించాలన్నారు. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైందని గుర్తు చేశారు. ఆ ఏడాది ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందన్నారు. దీంతో ప్రాజెక్టులోని ప్రెజర్ సెల్స్ పనిచేయడం లేదని వివరించారు. డ్యామ్ గ్యాలరీలోని డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలూ పనిచేయడం లేదని, వాటిని ఏపీ పట్టించుకోవడం లేదని ఎన్​డీఎస్​ఏకి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని, నీటి పంపకాలపై ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్​సీ అనిల్​ కుమార్​, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, సెంట్రల్​ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్​ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర రావు, శ్రీశైలం సీఈ కబీర్ బాషా తదితరులు హాజరయ్యారు.

Featured జాతీయ అంతర్జాతీయ

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 – వి ఎస్ యు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి ఎస్ యు) లో నెహ్రూ యువ కేంద్రం, నెల్లూరు మరియు వి ఎస్ యు ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ను నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమం యువతకు తమ ఆలోచనలు, అభిప్రాయాలను దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రదర్శించేందుకు ఒక ఉత్తమ వేదికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు ఇందులో పాల్గొనవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు “My Bharat” పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, వికసిత్ భారత్ పై తమ ఆలోచనలను వివరించే ఒక నిమిషం వీడియోను చిత్రీకరించి, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నెల్లూరు నోడల్ డిస్ట్రిక్ట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 150 మంది యువతను ఎంపిక చేసి, “వన్ నేషన్, వన్ ఎలక్షన్” అనే అంశంపై మూడు లేదా నాలుగు నిమిషాలు మౌఖికంగా మాట్లాడే అవకాశం కల్పించబడుతుంది. ఐదుగురు జ్యూరీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 మందిని ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్‌కు పంపించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు ఎంపికై, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జాతీయ స్థాయిలో తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం పొందుతారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. పూర్తి వివరాల కోసం: ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త: డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం (8187814140) నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి: డాక్టర్ ఏ. మహేందర్ రెడ్డి (99635 33440) సమయాన్ని సద్వినియోగం చేసుకొని యువతీ, యువకులు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి గారికి ధన్యవాదాలు – ఉద్యోగ,ఉపాధ్యాయులు*

*నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు తదితర నియోజకవర్గాలలో ఓటు హక్కును కలిగియున్న ఉద్యోగ ఉపాధ్యాయులు తిరుపతి కి వెళ్లి ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు.సదరు విషయాన్ని మీడియా సహకారంతో జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకు వెళ్లడంతో కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఓటు హక్కు కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని కలెక్టర్ గారికి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని మనవి.

  విషయం; *ఓటు హక్కును కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని మనవి.* మేము సైదాపురం,రాపూరు,కలువాయి మండలాలలో పని చేయుచున్న ఉద్యోగ ఉపాధ్యాయులం. మాకు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు తదితర నియోజకవర్గాలలో ఓటు హక్కును కలిగి యున్నాము.మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము పని చేయుచున్న కార్యాలయాలలో ఫారం 12 ను సమర్పించడం జరిగింది.మేము 5-5-2024 వ తేదీ మా ఫెసిలిటేషన్ సెంటర్లకు వెళ్లి ఓటు హక్కును అభ్యర్థించగా తిరుపతికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.సదరు విషయం పరీశీలించి మాకు ఓటు హక్కు కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరు కుంటున్నారు

Featured ఆంధ్రప్రదేశ్

మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి వైసిపికి ఛీ కొట్టి చంద్రబాబు సమక్షంలో టిడిపికి జై కొట్టారు

కోవూరులో వైసిపికి షాకుల మీద షాకులు చంద్రబాబు సమక్ష్యంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్న వైసిపి ఎంపీటీసీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనికి చేరిన వేళా విశేషమా.. మార్పు కోరుతున్న ప్రజాభీష్టానికి సంకేతమా.. కారణమేదైతేనేం వలసలతో కోవూరు వైసిపి విల విల లాడుతోంది. ఇప్పటికే వలసలతో సగం ఖాళీ అయిన కోవూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ యిచ్చారు మైపాడుకు చెందిన గంపల సుబ్రహ్మణ్యం దంపతులు. ఇందుకూరుపేట మండలం మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి వైసిపికి ఛీ కొట్టి టిడిపికి జై కొట్టారు. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపి సుప్రీం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి ఆమె భర్త గంపల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలో గంపల జయంతి దంపతులను మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారు అభినందించారు. వీరితో పాటు పడుగుపాడుకు శ్రీహరి కూడా వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన గంపల జయంతి దంపతులు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో జరగాలంటే పాలనా అనుభవమున్న చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమన్నారు. కోవూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీ అభ్యర్థులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్ల విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*. సోడే నాగరాజు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవము*

నెల్లూరు జిల్లా లో NLEP విభాగంలో APMO గా, మరియు DPMO గా దాదాపు 29 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి, ఉన్నతాధికారుల ప్రశంసలు, సాటి ఉద్యోగుల మన్ననలు పొంది, ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన నిష్కల్మషుడు, నిగర్వి, మన ఆత్మీయ మిత్రుడు శ్రీ *సోడే నాగరాజు* గారికి పలువురు అతిథులు, వక్తలు మనఃపూర్వక ఉద్యోగ విరమణ శభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య్రమంలో DMHO డా. పెంచలయ్య గారు, DLO డా.ఖాదర్ వలీ గారు, న్యూక్లియన్స్ MO, డా.సురేష్ గారు, డా. కనకాద్రి గారు, APPMEA రాష్ట్ర అధ్యక్షులు జోషఫ్ గారు, కోశాధికారి రామకృష్ణ గారు, విశ్రాంత PMO నరసింహారెడ్డి గారు, విశ్రాంత DPMO అనీఫ్ గారు, సుధాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్యారా మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎంప్లాయీస్ అసోసియేషన్, (APGEA) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సభ్యులు, నాగరాజు గారి కుటుంబ సభ్యులు బందువులు పాల్గొని, ప్రసంగించారు..

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోడే నాగరాజు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవము

*। సోడే నాగరాజు   ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవము* (సాహితీ పున్నమి) నెల్లూరు జిల్లా లో NLEP విభాగంలో APMO గా, మరియు DPMO గా దాదాపు 29 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి, ఉన్నతాధికారుల ప్రశంసలు, సాటి ఉద్యోగుల మన్ననలు పొంది, ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన నిష్కల్మషుడు, నిగర్వి, మన ఆత్మీయ మిత్రుడు శ్రీ *సోడే నాగరాజు* గారికి పలువురు అతిథులు, వక్తలు మనఃపూర్వక ఉద్యోగ విరమణ శభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య్రమంలో DMHO డా. పెంచలయ్య గారు, DLO డా.ఖాదర్ వలీ గారు, న్యూక్లియన్స్ MO, డా.సురేష్ గారు, డా. కనకాద్రి గారు, APPMEA రాష్ట్ర అధ్యక్షులు జోషఫ్ గారు, కోశాధికారి రామకృష్ణ గారు, విశ్రాంత PMO నరసింహారెడ్డి గారు, విశ్రాంత DPMO అనీఫ్ గారు, సుధాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్యారా మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎంప్లాయీస్ అసోసియేషన్, (APGEA) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సభ్యులు, నాగరాజు గారి కుటుంబ సభ్యులు బందువులు పాల్గొని, ప్రసంగించారు..

Featured ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ప్రతి కుటుంబానికి జగనన్న ఇచ్చిన ఆస్తి చదువే*

*: బహుజన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి* *: అంబేడ్కర్ కల జగనన్న నిజం చేశారు* *: జగనన్న అబద్దపు హామీలు ఇవ్వలేదు*   రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందించారని, అయితే జగనన్న ప్రతి కుటుంబానికి ఇచ్చిన అస్తి చదువేనని, ఆ చదువులో ప్రతి కుటుంబం భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళ్లి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో బహుజనుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబంలో చిన్నారులు చదువుకునేందుకు వారి తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడిని అందించారని, అంతేకాక ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారని, దీంతో మన రాష్ట్రంలో చదువుకునే వారి శాతం పెరిగిందని అన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని, తన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చదువుల కోసం ఎన్నో ఇబ్బందులు వడ్డారని, ఆయన బాగా చదువుకోవడంతో మా కుటుంబమంతా ఉన్నతికి చేరుకుందని, మండలంలో విద్యాభివృద్ధి కోసం కూడా కృషి చేశారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి కుటుంబంలో ఒక్కరూ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని జగనన్న భావించారని, అందుకోసం తన ఐదేళ్ల పాలనలో విద్యపైనే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్న మెనిఫెస్టో ప్రజలందరికి నమ్మకం ఉందని, మళ్లీ ఆయన ప్రకటించిన మెనిఫెస్టోపై ప్రజలంతా నమ్మకం కలిగి ఉన్నారని, సంక్షేమం రెండింతలు తప్పక అవుతుందన్నారు. గతంలో మెనిఫెస్టోలో రుణమాఫీ చేయాలని చాలా మంది చెప్పిన సందర్భంలో కూడా నేను చేయలని హామిని ప్రజలకు ఇవ్వలేనని, చెప్పిన ప్రతి హామిని నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని జగన్నన చెప్పారన్నారు. ఇలా గతంలో ఆయన ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజల్లో మెనిఫెస్టోపై నమ్మకం తీసుకురావడంతోనే ఆయన పట్ల ప్రజలందరికి నమ్మకం ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు నందా ఓబులేను సైతం ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకంతోనే మాకు మద్దతు తెలిపి మా వెంట నడిచేందుకు సిద్ధమయ్యారని వివరించారు. మెనిఫెస్టోలో జగనన్న 50 శాతం దళితులు ఉండి, దళితుల జనాభా 500కు పైగా ఉన్న వాటిని ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆయన హామి ఇస్తే తప్పక చేస్తారనే నమ్మకంతోనే నందా ఓబులేసు తదితరులు వైఎస్సార్సీపీ వెంట నడుస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులను కూడా భాగస్వాములను చేసుకోవాలని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి వధంలో నడిపిస్తామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.230 కోట్లు విలువ చేసే ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను దివంగత మంత్రి మా సోదరుడు గౌతమ్ రెడ్డి పేరున ప్రభుత్వానికి అంచచేయడం జరిగిందని, మా తండ్రి ఒకే మాట చెబుతారని, రాజకీయాల్లోకి వచ్చేది ప్రజా సేవ చేసేందుకేనని. ఆ విధంగా మేకపాటి కుటుంబం ముందుకు సాగుతుందని అన్నారు. గతంలో అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో చేయబోయే మంచిని చెబుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రజలందరిని కోరాలనిని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్ నందా ఓబులేసు,ఆత్మకూరు చిన్నపిల్లల డాక్టర్ ఆది శేషయ్య,ఎంపీపీ గంగ వరపు శ్రీనివాసులు నాయుడు వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! కాకర్ల,

  ఓటమి భయంతోనే అసత్య ప్రచారాలు..! జర జాగ్రత్త వైసిపి మైండ్ గేమ్ ఆడుతుంది..! అబద్ధాలు నమ్మకండి నిజం గెలవాలి..! సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోండి..! చాకలి కొండ జనార్ధనపురం పంచాయతీలో పల్లె పల్లెకు కాకర్ల,- బ్రహ్మరథం పట్టిన పల్లెవాసులు అడుగడుగునా నీరాజనాలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో అపూర్వ స్వాగతం వింజమూరు ఏప్రిల్ 08 ఓటమి భయంతోనే వైసిపి నాయకులు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రసారాలు చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.వింజమూరు మండలం లోని చాకలి కొండ జనార్ధన పురం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల ఇంటింటి ప్రచారాన్ని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రజలు బ్యాండ్ మేళం బాణా సంచాలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ సురేష్ అన్న నీ వెంటే మేము అంటూ ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట నడిచారు. ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగు దేశాన్ని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ పురిటిగడ్డ పై మమకారంతో జీవితాల్లో వెలుగులు నింపేందుకు వచ్చానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి కొన్ని జీవితాలు మారుస్తానని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే పల్లెల్లో కనిపిస్తుందని వైసీపీ వల్ల ఒరిగింది ఏమి లేదన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అధోగతి పాలై 20 సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారన్నారు. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం వల్ల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది తప్ప ముందుకు పోలేదన్నారు. గత 40 సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి తప్ప మార్పు రాలేదన్నారు. మార్పు కావాలంటే పెద్దల గౌరవనీయులు అజాతశత్రువు అపర భగీరధుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అదేవిధంగా ట్రస్టు ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కాకర్ల సురేష్ అను నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని కోరారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన రాష్ట్రం అంధకారం అవుతుందని పిల్లల జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతాయి అని ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు తీసుకొస్తాను అన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉందన్నారు. అబద్దాల ప్రభుత్వాన్ని ఓడించి నిజాన్ని గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకోవాలని తెలిపారు.ప్రతి పల్లెలో టిడిపి నాయకులు అభి మానులు కాకర్ల సురేష్ గారిని శాలువా గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కూనల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నదాన ప్రభు ఆరోగ్య ప్రదాత అభాగ్యుల ఆపద్బాంధవుడు కాకర్ల సురేష్ అని ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాజీ కన్వీనర్ గూడా నరసారెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరు వెంకటేశ్వరరావు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ ఎఫ్సీఐ డైరెక్టర్ అంకినపల్లి ఓబుల్ రెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి గణపం సుదర్శన్ రెడ్డి ఆరికొండ శ్రీనివాసులు బయ్యపు రెడ్డి కేశవులురెడ్డి జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ స్థానిక మాజీ సర్పంచ్ రమణారెడ్డి సర్పంచ్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర్లు మబ్బు బుచ్చయ్య దిండు మహేష్ దిండు వీరనారాయణ ఎస్ చెంచయ్య కేశవులు కే మాలకొండయ్య పి మాల్యాద్రి కే మాల్యాద్రి ఏలూరు గురవయ్య కాకర్ల హుస్సేన్ నాయుడు బత్తిన వెంకటేశ్వరరావు కాకర్ల మాల్యాద్రి షేక్ రసూల్ జి వెంకటేశ్వర్లు ఎస్టి ఖజా సయ్యద్ చుంచు మల్లికార్జున అడుసు మళ్ళీ తిరుపాలు వెంకటేశ్వర్లు చెరుకూరు వెంకటేశ్వర్లు పత్తిపాటి కృష్ణయ్య చెరుకూరి నాగేంద్రబాబు జి మాల్యాద్రి మాలకొండయ్య గున్న వెంకటయ్య నాయకులు తలప నేనీ వెంగయ్య బి గోపాలు పుల్లయ్య చెంచయ్య బసయ్య మండల నాయకులు ఆయా గ్రామాల నాయకులు జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.