Sunday, 12 July 2026

Blog

ఖమ్మం

నకిలీ విత్తనాలు విక్రయించే వారిని కఠినంగా శిక్షించాలి :పడిగల మధు డిమాండ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి వర్షాలు పడి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం లో రైతున్నలని నఖిలి విత్తనాల భయం పట్టుకుంది. ఏవి నఖిలినో ఏవి నకిలీ కావో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు లకి నకిలీ విత్తనాలు పట్ల అవగాహనా కలిపించాలని అని బిజెపి ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు డిమాండ్ చేశారూ..నకిలీ విత్తనాలు అమ్మి రైతులని మోసం చేసే కంపెనీ లని సీజ్ చేయాలి పడిగల మధు డిమాండ్ చేసారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

తెలంగాణ

నూతన భవనం మరియు సీసీ రోడ్డు ప్రారంభం

శాలిగౌరారం మండలంలోని తక్కెల్లపాడు గ్రామంలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే మందుల సామెలు ప్రారంభించారు. ఈకార్యక్రమానికి గౌరవ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ గారు, ప్రజలు పాల్గొన్నారు. తదుపరి ఇండ్ల లబ్ధిదారులు అండాలు అనే మహిళ ఇంటి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు

ఆంధ్రప్రదేశ్

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం: మోర్త సత్తిబాబు

కోనసీమ: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అంబాజీపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు అన్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో భర్త చనిపోయిన 11 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కూటమి మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి*

ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో రెండు 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, మరో నాలుగు ఆయుష్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో ఐదు ఆయుష్ ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు కూడా సహకారం అందించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 126 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 92 కో-లొకేటెడ్ ఆయుష్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ముఖ్యమైన ఆయుష్ మందుల సరఫరాకు కేంద్రం ద్వారా మద్దతు లభించిందని మంత్రి వివరించారు. అంతేకాక, ఒక కొత్త ఆయుష్ విద్యాసంస్థ ఏర్పాటుతో పాటు, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం అందించామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని చెంగనగుంట రూ.9.08 లక్షలు, కురుగొండ రూ.8.62 లక్షలు, మోమిడి రూ.8.01 లక్షలు, మంగళం ప్రాజెక్టుకు రూ.8.29 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఈ నాలుగు కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూన్ 2025 వరకు మొత్తం 25,173 మంది లబ్ధిదారులు ఆయుష్ సేవలు పొందారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఇటీవల తిరుపతి జిల్లాలోని రాస్-కృషి విజ్ఞాన కేంద్రంలో “నన్నారి సాగు, కోత తర్వాత నిర్వహణ, మార్కెటింగ్ అవకాశాలు” అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడిందని, దాని ద్వారా సుమారు 60 మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు రూ.10.80 లక్షలు, అశ్వగంధ మొక్కల ప్రచారానికి రూ.18.90 లక్షలు ఆర్థిక సహాయం అందించబడిందని కేంద్ర మంత్రి వివరించారు. *ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్త్రుతమన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృత సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పంటపాలెం లోని బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం పలువురు కార్మికులకు గాయాలు బంగే పామాయిల్ ఫ్యాక్టరీలో రిఫైనరీ లను శుభ్రపరుస్తుండగా ప్రవహించిన కెమికల్ కలిసిన నీరు దాంతో పలువురు కార్మికులకు గాయాలు అవ్వగా ముత్తుకూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు, ఈ ఘటన గురించిన ప్రమాద వివరాలను రహస్యంగా ఉంచిన ఫ్యాక్టరీ యాజమాన్యం.

ఆంధ్రప్రదేశ్

అవినీతి తిమింగలాలు ఇక తప్పించుకోవడం అసాధ్యం! – సుప్రీంకోర్టు స్పష్టమైన ప్రకటన

దేశ ప్రజలకు ఇది ఓ కళ్లెత్తి చూపే (Eye Opener) తీర్పు!ఇప్పటివరకు అవినీతిని అరికట్టడానికి విచారణలో కాలయాపన, రాజకీయ ఒత్తిళ్లు, నిబంధనల లోపాలు అవినీతిపరుల‌కు రక్షణ కల్పించేవి. కానీ, ఇకపై పరిస్థితి మారింది!❗ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది:“అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ (Preliminary Inquiry) అవసరం లేదు!”ఇదే నిజమైన క్లీనింగ్ ఆపరేషన్ కు మొదటి అడుగు!🔥 ఇక అవినీతి పట్ల చల్లగా ఉండటం ప్రజల భవిష్యత్తును నాశనం చేసే తప్పే!🔥⚖️ ప్రజలుగా మన బాధ్యత ఏమిటి?1️⃣ ఎవరైనా లంచం అడిగితే వెంటనే పిర్యాదు చేయండి!2️⃣ అధికారులు, ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడితే ప్రూఫ్‌తో రిపోర్ట్ చేయండి!3️⃣ మీ వద్ద ఆధారాలు లేనప్పటికీ అనుమానాస్పద లావాదేవీలు ఉంటే అధికారిక మాద్యమాల్లో ఫిర్యాదు చేయండి!—📢 ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలి?👉 కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC):📞 టోల్-ఫ్రీ నంబర్: 1800-11-0180📩 ఇమెయిల్: complaint@cvc.gov.in🌍 వెబ్‌సైట్: www.cvc.gov.in👉 లోకాయుక్త (Lokayukta – రాష్ట్ర స్థాయిలో అవినీతి నిరోధక సంస్థ):📞 ఏపీ లోకాయుక్త హెల్ప్‌లైన్: 0863-2222631📩 ఇమెయిల్: lokayukta-ap@nic.in🌍 వెబ్‌సైట్: www.lokayukta.ap.nic.in👉 ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB):📞 హెల్ప్‌లైన్: 14400📩 ఇమెయిల్: acbapp@ap.gov.in🌍 వెబ్‌సైట్: acb.ap.gov.in👉 CBI అవినీతి నిరోధక విభాగం:📞 ఫోన్ నంబర్: 011-24360232📩 ఇమెయిల్: info@cbi.gov.in🌍 వెబ్‌సైట్: www.cbi.gov.in—🚀 మీ ఫిర్యాదు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు?✅ ACB / CBI అధికారికంగా విచారణ ప్రారంభిస్తుంది✅ రహస్యంగా దర్యాప్తు చేసి, లంచం తీసుకున్న అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు✅ తదుపరి విచారణలో నేరం రుజువైతే సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు✅ అవినీతి నిరూపితమైతే ఉద్యోగం నుంచి తొలగింపు, జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు ఉంటాయి—💪🏻 ప్రజలు కలిసొస్తే అవినీతి అంతం అనివార్యం!👉 “పరిశుభ్ర సమాజం కోసం నువ్వు ఏదైనా చేశావా?” అనే ప్రశ్న నీ మనస్సులో ప్రశాంతత కలిగించేలా ఉండాలి.👉 అవినీతి అనేది మన దేశం మీద ఒక రుగ్మత, దీన్ని నిర్మూలించేందుకు మనందరం బాధ్యత వహించాలి!👉 నిజమైన దేశభక్తి అంటే – నీ కళ్ల ముందు అవినీతి జరిగినప్పుడు నువ్వు స్పందించడమే!—🇮🇳 మన నినాదం:🔴 “ఒక లంచగొండి బయటపడితే… వంద మందికి మాయాజాలం నేర్పుతాడు!”🔴 “ఒక లంచగొండి శిక్షపడితే… వంద మందికి న్యాయమే మిగిలిపోతుంది!”🚨 మీరు పిర్యాదు చేస్తేనే సమాజం మారుతుంది!🚨 మీ నిస్వార్థ పోరాటం భవిష్యత్ తరాల కోసం ఒక దీపం!🔥 అవినీతిని అరికట్టేందుకు మీ వంతు బాధ్యత నెరవదీయండి!🔥🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 మండల్ సమాచార కేంద్రం. MCIC ఇంచార్జ్.&. 🇮🇳CRPFI.🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీD. సురేష్. PR. 9133366449.🇮🇳 జైహింద్ 🇮🇳

అనంతపురం

శిక్ష నుండి విడుదల అయ్యాక్కా ఇతని మీద 12 కేసులు నమోదు అయిన్నాయి

ఆలూరు గ్రామ ప్రజలను భయపెట్టే విధంగా ఆలూరు రాజగోపాల్ రెడ్డి అలియాస్ నూకల రాజగోపాల్ రెడ్డి చరిత్ర మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గతంలో పలు హత్యలకు పాల్పడి, జీవితకాల శిక్ష అనుభవించిన ఆయన, క్షమాబిక్ష కింద జైలు నుంచి విడుదలైన తరువాత కూడా తన ప్రవర్తన మార్చుకోకపోవటం వల్ల గ్రామస్థులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.స్థానికుల ఆరోపణల ప్రకారం, రాజగోపాల్ రెడ్డి గతంలో సమాచారం తెలియకుండానే అనేక కిరాయి హత్యలకు పాల్పడ్డాడని, ఒక హత్య కేసులో శిక్ష అనుభవించాడని. ఆయన విడుదలైన తరువాత కూడా భూమి ఆక్రమణలు, ఇసుక మాఫియాలో భాగస్వామ్యం, ప్రజా భూములపై అక్రమంగా కబ్జాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇతడు భారీగా సంపాదించిన అక్రమ ధనాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను ప్రలోభపెట్టి, వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఎంతోమంది అమాయకులు అన్యాయంగా నష్టపోతున్నారు. గ్రామంలో భయం వాతావరణం ఏర్పడింది. స్థానిక యువత, రైతులు, పౌరహక్కుల కార్యకర్తలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై పోలీస్ శాఖ, ACB, CID మరియు మానవ హక్కుల సంఘాలు విచారణ చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

తిరుపతి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

నాయుడుపేట పట్టణంలోని కెఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం ఉదయం నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,దేవసేన ల కుమార్తె వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నూతన వధూవరులైన మానస,మధురెడ్డి లను ఆశీర్వదించారు.ఆయన తోపాటు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సూళ్లూరుపేట ఎంపీపీ అనిల్ రెడ్డి, వైసిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, బైనా మల్లికార్జున్ రెడ్డి,జట్టి వేణు యాదవ్ పలువురు నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అన్నమయ్య

శింగారెడ్డిపల్లి పంచాయతీ పింఛన్ కార్యక్రమం మదన్ నరసింహ

పెనగలూరు పున్నమి ప్రతినిధి ఆగస్టు 1 రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా వరలక్ష్మి అమ్మ ముక్కా సాయి వికాస్ రెడ్డి వాళ్ల ఆధ్వర్యంలో పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది ఇందులో మదన్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.