Tuesday, 14 July 2026

Blog

జనగాం

🇮🇳 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జెడ్పిహెచ్ఎస్ ఏడునూతుల 🇮🇳

పున్నమి ప్రతినిధి, జనగాం: 15 ఆగస్టు 2025. జెడ్పిహెచ్ఎస్ ఏడునూతుల పాఠశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి, నగదు బహుమతులు చెక్ రూపంలో ప్రదానం చేశారు. 👉 SSC–2025 లో పాఠశాల స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, గణిత సబ్జెక్ట్, స్కూల్ అసిస్టెంట్ భాస్కర్ మాడరాజు స్వయంగా ప్రోత్సాహక బహుమతులను *చెక్* రూపంలో అందజేశారు. 1️⃣ మొదటి ర్యాంక్ – కర్ర శ్రీజర్ రెడ్డి (566/600, BASARA IIITలో చేరారు). బహుమతి: ₹3,116/- చెక్ (తల్లిదండ్రులు స్వీకరించారు). 2️⃣ రెండవ ర్యాంక్ – షేక్ అబ్బాస్ (563/600). బహుమతి: ₹2,116/- చెక్ (తల్లిదండ్రులు స్వీకరించారు). 3️⃣ మూడవ ర్యాంక్ – మలుగు సుజిత (521/600). బహుమతి: ₹1,116/- చెక్ (తల్లిదండ్రులతో కలిసి స్వీకరించారు). 👉 అదేవిధంగా, రామవరం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మణ చారి కూడా SSC–2025లో మొదటి, రెండవ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేశారు. 👉 ఈ సందర్భంగా, కీర్తిశేషులు శ్రీ కొల్లూరి కొండయ్య గారి జ్ఞాపకార్థం, వారి కుమారుడు కొల్లూరి వెంకన్న (పీజీహెచ్ఎం, మాదన్నపేట) గారు జెడ్పిహెచ్ఎస్ ఏడునూతుల మరియు పిఎస్ ఏడునూతుల విద్యార్థులలో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదివి ప్రథమ స్థానం సాధించిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. నారబోయిన యాకయ్య గారి సందేశం > “స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక రోజు జెండా ఎగరవేయడం కాదు, అది మన మనసులో ఉండే బాధ్యత. ఈ పాఠశాల విద్యార్థులు కేవలం మార్కుల్లోనే కాకుండా, విలువల్లో, క్రమశిక్షణలో కూడా అగ్రగాములవ్వాలి. ఈ రోజు ఇచ్చిన బహుమతులు కేవలం డబ్బు కాదు — అవి మీపై ఉన్న నమ్మకం, మీ భవిష్యత్తుకు పెట్టిన విత్తనం. దాన్ని మీరు ఫలవంతం చేయాలి.” భాస్కర్ మాడరాజు గారి ప్రతిజ్ఞ > “నేను ఈ నగదు బహుమతులు చెక్ రూపంలో కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కొనసాగిస్తాను. మన గ్రామం, మన పాఠశాల పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. చదువు ద్వారా మీరు మీ జీవితం మార్చుకోవచ్చు. మీరు సాధించిన ప్రతి విజయం, మీ కుటుంబానికి గౌరవం, మన గ్రామానికి ప్రేరణ. నేను ఎప్పటికీ మీతో ఉంటాను.” ఈర్య గారు (SA–English): జెడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో ఆంగ్ల ఉపాధ్యాయుడైన ఈర్య గారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అద్భుతంగా యాంకరింగ్ చేశారు. తన ప్రసంగంతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. ముఖ్య అతిథులను గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానించి, కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగదు బహుమతులు అందించిన వారి సేవా తత్పరతకు పాఠశాల ఏఏపిసి, హెడ్‌మాస్టర్ శ్రీ నారబోయిన యాకయ్య (జెడ్పిహెచ్ఎస్ ఏడునూతుల), ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎమ్ శ్రీ బుక్క ప్రవీణ్ కుమార్ (పిఎస్ ఏడునూతుల), ఉపాధ్యాయులు: యాదగిరి , సోమేశ్వర్ , G.రజిత, మరియు విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. Video: https://youtu.be/JAFL9pkfAcs?si=HmP2HC-0nOLhB34r

E-పేపర్

ఉద్యోగుల హక్కుల కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఏపీజిఈఏ అని జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆవిర్భ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2019లో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అన్నారు. సంఘం స్థాపించి లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉద్యోగుల పాలిట ఏకైక ఆశాజ్యోతి అయిన రాష్ట్ర అధ్యక్షులు కాశీభట్ల రామ సూర్యనారాయణకి నంద్యాల జిల్లా తరఫున కృతజ్ఞతలు మరియు నమస్సుమాంజలి తెలుపుతున్నామన్నారు. నిరంతరం ఉద్యోగుల కోసం పాటుపడుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల బకాయిలపై రండి టి తాగుతూ మాట్లాడుకుందాం అనేటటువంటి విన్నూత్న కార్యక్రమాలతో ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని, రాబోయే రోజుల్లో మరింత కృషితో సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేయడం లో నంద్యాల జిల్లా ను రాష్ట్రంలోనే ముందు ఉండే విధంగా అహర్నిశలు కృషి చేయాలని కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా లో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంఘానికి మద్దతు తెలియజేయాలని, ఉద్యోగుల కొరకు నిబద్ధతతో పని చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని, నాయకులను మాత్రమే ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

చిత్తూరు

ఘనంగా ఆడికృత్తిక, కృష్ణాష్టమి వేడుకలు – పాల్గొన్న ఎమ్మెల్యే

పలమనేర్ లో ఆడికృత్తిక మరియు కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలమనేరు శాసనసభ్యుల అమరనాథ రెడ్డి స్థానిక టిడిపి నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలలో పాల్గొని స్వామివారిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు విరివిగా కురిసి రైతులు మంచి పంటలను పండించాలని అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఇక ఆలయం వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు RBC కుట్టీ, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, శ్రీధర్, ఖాజా, నాగరాజు,అమరనాథ రెడ్డి, మదన్, రూపేష్, జగదీష్, హరీష్, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ముమ్మిడివరం లో కృష్ణాస్టమి వేడుకలలో పాల్గొన్న నల్లా పవన్

కోనసీమ: ముమ్మిడివరం లో ఉన్న శ్రీ భగవాన్ పెద బాలయోగీశ్వరుల వారి తపో ఆశ్రమం నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిర్మల్

మాయమాటలు చెప్పి గొలుసు దొంగతనం

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాస్తవపూర్ గ్రామానికి చెందిన యమున పశువులను మేపేందుకై అబ్దుల్లాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోకి వెళ్ళింది. పశువులు మేపుతున్న సమయంలో అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకి మాయ మాటలు చెప్పి మెడలో ఉన్న రెండు తులాల గొలుసును లాక్కొని తను వచ్చిన అదే ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. జరిగిన విషయాన్ని యమునా లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిసి ఫుటేజ్ ల ఆధారంగా ముధోల్ మండలం ఆష్ట కాలనీకి చెందిన పిప్పర విజయ్ అని తెలియడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిజమే అని తెలిసింది. దీంతో శనివారం గొలుసు దొంగతనం చేసిన పిప్పర విజయ్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు అవినాష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. జల్సాల కోసం ఇలా దొంగతనాలు అలవాటు చేసుకోవడం మంచిది కాదని ఎలాంటి తప్పిదాలు చేసిన నిఘానేత్రం తప్పకుండా గుర్తిస్తుందని అన్యాయం జరిగిన ప్రజలకు న్యాయం చేయకురేలా ఎంతటి వారైనా ఉపేక్షించకుండా పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. ప్రజలు ఇలాంటి దొంగల బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదని తెలిపారు. మీడియా సమావేశంలో సిఐ మల్లేష్ లోకేశ్వరం ఎస్సై అశోక్ లు ఉన్నారు.

నాగర్‌కర్నూల్

ఉయ్యాలవాడ నుంచి చర్ల తిరుమలాపూర్ వెళ్ళే రోడ్డును పరిశీలించిన నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

భారీ వర్షాల కారణంగా చర్ల తిరుమలాపూర్ వెళ్ళే రోడ్డు మీదకు వరద నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మేల్యే గారు స్వయంగా వెళ్ళి పరిశీలించి అందుకు ప్రత్యామ్నాయంగా చర్ల తిరుమలాపూర్ నుంచి చర్ల ఇటిక్యాల మీదుగా నాగర్ కర్నూల్ పట్టణానికి వచ్చే రోడ్డును మరమ్మతులు చేసి గ్రామస్థులకు రోడ్డు సదుపాయం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఈఈ విజయ్ కుమార్ గారిని ఆదేశించడం జరిగింది. ఇందుకు గాను గ్రామస్థులు ఎమ్మేల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ♦️ఎమ్మేల్యే గారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్ల తిరుమలాపూర్ గ్రామస్థులు సంభధిత అధికారులు ఉన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

రెబ్బెన మండల కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారతదేశ ముద్దుబిడ్డ దేశానికి విశేష సేవలు అందించిన భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్రాజ్ రాంబాబు, జిల్లా నాయకుడు గోలెం తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ మండల కోశాధికారి మండల మధుకర్ మండల కార్యదర్శి ముంజాల వెంకన్న నాయకులు నవీన్ గౌడ్ కనకయ్య సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ అష్టమి తిలతైలా అభిషేక పూజలు…

శ్రీ విశ్వవసు సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం అష్టమినాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే తిల తైల అభిషేక,అర్చన, తదియ ప్రత్యేక పూజలు,అభిషేకలు వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శని వారం శ్రావణ అష్టమి తిథి నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తి పూర్వకంగా స్వామివారిని కొలచడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి,నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితంఉంటుందన్నారు. ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకపూజలు, అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య చేశారు.గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్ ప్రభాకరచారి, పుల్లయ్య,వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎలూరు

నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు పంపిణీ

నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు పంపిణీ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి దాతలు అందజేసిన ఆర్థిక సహాయంతో నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను పంపిణీ చేశారు. మండలంలోని తోటపల్లి హీల్ సంస్థలో శనివారం దాతలు బోడేపూడి శివ కోటేశ్వరరావు, బ్రహ్మయ్య, అందజేసిన ఆర్థిక సహాయంతో నలుగురు దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళను అందజేశారు. ఈ కార్యక్రమంలో హీల్ సంస్థ సీఈవో కూరపాటి అజయ్ కుమార్, సిద్ధార్థ అకాడమీకి చెందిన తాడిపనేని రమేష్, నీహ, సిబ్బంది పాల్గొన్నారు.

ఎలూరు

కృష్ణ ముకుందా మురారి

కృష్ణా… ముకుందా…మురారి ఆగిరిపల్లి: శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మండలంలో భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆగిరిపల్లి లోని వరాహ పుష్కరిణి వద్ద గల వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ యువసేన ఆధ్వర్యంలో కోలాటం, ఉట్టి కొట్టే కార్యక్రమం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.మంత్రి కొలుసు పార్థసారథి నెక్కలం గొల్లగూడెం, ఎస్ ఏ పేట, ఆగిరిపల్లి లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను మండలంలో భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆగిరిపల్లి లోని వరాహ పుష్కరిణి వద్ద గల వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ యువసేన ఆధ్వర్యంలో కోలాటం, ఉట్టి కొట్టే కార్యక్రమం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.మంత్రి కొలుసు పార్థసారథి నెక్కలం గొల్లగూడెం, ఎస్ ఏ పేట, ఆగిరిపల్లి లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.