అన్నమయ్య జిల్లా. ఓబులవారిపల్లె మండలం, ముక్కావారిపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీ కప్పల బాబు – శ్రీమతి రాజేశ్వరి గార్ల కుమార్తె కుసుమ మరియు మారేళ్ళ చిన్నయ్య, ఈశ్వరమ్మ గారి కుమారుడు అనీల్ గారివివాహం ముక్కావారిపల్లె గ్రామం లోని T.T.D. కళ్యాణ మండపము నందు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయుకులు పాల్కొన్నారు.
ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు సూపర్ సిక్స్ పథకం అమలులో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త అందించింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. 70% వైకల్యం ఉన్నవారు..18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పథకానికి అర్హులు. అర్హత కలిగినవారు అక్టోబర్ 31 లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందని వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. దివ్యాంగులకు త్రిచక్ర బైక్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ గిఫ్టెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ (APDASCAC) మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతలు ఇవే 1. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. 2. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. 3. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 4. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 5. లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 6. సొంత వాహనం ఉన్నవారికి వర్తించదు. 7. గతంలో ఈ పథకం కంద వాహనాలు తీసుకోకూడదు. దరఖాస్తు చేసుకునేటప్పుడు కావాల్సిన అవసరమైన పత్రాలు 1. ఆధార్ కార్డు, 2. జిల్లా వైద్య బోర్డు జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం. 3. SSC సర్టిఫికేట్ (టెన్త్ సర్టిఫికేట్), 4. SC, ST అయితే కుల ధృవీకరణ పత్రం, 5. వికలాంగుల పూర్తి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్. 6. ఆదాయ ధృవీకరణ పత్రం (01-01-2022 తర్వాత తీసుకోవాలి) 7. బోనఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థి అయితే) 8. ముందుగా వాహనం తీసుకోలేదని మరియు అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వబడిందని స్వీయ ప్రకటన. రిజర్వేషన్ మహిళలు – 50% పురుషులు – 50% SC-16% ST -7% జనరల్ – 77% ప్రాధాన్యత 1. PG విద్యార్థులు 2. స్వీయ/వేతనం/జీతం డిగ్రీ హోల్డర్లు చివరి తేదీ: అక్టోబర్ 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు విధానం www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం అర్హతలను తనిఖీ చేసి అర్హుల జాబితాను ప్రకటిస్తుంది.. వారికి మూడు చక్రాల మోటారు వాహనాన్ని అందిస్తారు.
చిట్వేల్, ఆగస్టు 17 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షులు, డైనమిక్ లీడర్, ప్రజా నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ మండల ప్రజలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కృషి, నాయకత్వం, పార్టీ పట్ల అంకితభావం ప్రజలకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక రంగంలో ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఆయన మరింత ఉన్నత స్థాయిలోకి ఎదిగి పార్టీకి, ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. నాయకునిగా ఆయన చూపుతున్న వినయం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావం మరింత బలాన్ని ఇస్తుందని మండల ప్రజలు అభినందించారు. పంతగాని నరసింహ ప్రసాద్ గారు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో, విజయాలతో నిండిన జీవితాన్ని గడపాలని అందరూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో కిందపడిన భక్తుడిని సకాలంలో కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్. వివరాల్లోకెళితే ఆగస్టు 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలం, మామిడిపల్లి గ్రామస్తుడు మేడం శ్రీనివాసులు( 61) తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శన అనంతరం రాత్రి 9:30 గంటలకు లడ్డు ప్రసాదాలు తీసుకొని, లడ్డు కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపుకు వెళుతుండగా పడమర మాడా వీధిలో అకస్మాత్తుగా సదరు శ్రీనివాసులు గుండెపోటు వచ్చి కింద పడిపోయారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి వెంటనే భక్తుడి వద్దకు చేరుకొని సమయస్ఫూర్తితో 90 సార్లు సిపిర్ చేసి భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం భక్తుడిని తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం పంపడం జరిగినది. సిమ్స్ ఆస్పత్రిలో భక్తుడు మెరుగైన చికిత్స పొందినందున ప్రాణాలతో బ్రతికి బయట పడడం, డ్యూటీ డాక్టర్లు అతనిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఊరికి పంపడం జరిగినది. ఈ సంఘటన పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో భక్తుడిని కాపాడినందున భక్తులు మరియు అధికారులు సదరు కానిస్టేబుల్ గుర్రప్పను అభినందించినారు.
భక్తుల సౌకర్యాల కల్పనకు శ్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది — వెలుపల క్యూ లైన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల కొండపై భక్తుల రద్దీ పోటెత్తింది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. అధిక రద్దీ కారణంగా ఎటువంటి టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సౌకర్యాలు కల్పించే పనిలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, పాలు, అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. మరోవైపు గదులు లభించని భక్తులు ఉచిత వసతి సముదాయాలలో లాకర్లు పొంది సేద తీరుతున్నారు. ఏడుకొండలస్వామి కి తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకునేందుకూ భారీగా క్యూలు ఏర్పడుతున్నాయి. — క్యూలైన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ : భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అకస్మాత్తుగా అధికారులతో కలిసి క్యూ లైన్లును తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆక్టోపస్ సర్కిల్, నారాయణగిరి షెడ్స్, ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం సర్కిల్ లోని క్యూ లైన్లు పరిశీలించారు. భక్తుల బందోస్తును ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ,భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఉదయం నుండి ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు వచ్చారు.. రేపు, ఎల్లుండు ఎంత మంది వస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అదేవిధంగా నాలుగు మాడవీధులు ను కాలినడకన తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి శ్రీవారికి సేవ చేసేందుకు వచ్చిన భక్తులతో ఎస్పీ మాట్లాడుతూ క్యూలైన్ లో పరిస్థితి ఫై అడిగి తెలుసుకున్నారు.వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎదైన సమస్యలు వస్తే… వేంటనే పోలీసు వారితోపాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సెలవు దినాలు ఎక్కువ రావడం తో భక్తులు అధికసంఖ్యలో వస్తారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణ,తిరుమల డిఎస్పి విజయ శేఖర్, సీఐలు విజయకుమార్, శ్రీ రాముడు, హరిప్రసాద్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
16.8.25 వ తేదీన కడప నగర మున మానవత సంస్థ ఆత్మీయ కలయిక పలకరింపులో భాగంగా మోకాలి ఆపరేషన్ చేయించుకున్న మానవతా సభ్యులు శ్రీ జగ్గా రామకృష్ణ గారిని కలిసి ఆయనను పరామర్శించడంజరిగినది.ఆయనకు ఏదైనా అవసరము వస్తే ఆత్మీయ సహకార కమిటీకి తెలియజేయాలని తెలియజేయాలని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు శ్రీ రాటాల గోపి సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మరియు ప్రజా సంబంధాల చైర్మన్ పి సుబ్బరాయుడు కమిటీ డైరెక్టర్ శ్రీ సమ్మెట సత్యనారాయణ,నగర వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి సుబ్బరా యు డు నగర సెక్రటరీ ఏ.సుబ్బయ్యపాల్గొన్నారు.పుట్టా.సుబ్రహ్మణ్యం,చైర్మన్,ఆత్మీయ సహకార కమిటీ, కడప నగరం.
కడప నగర మానవతా సంస్థ ఆత్మీయ కలయిక పలకరింపులో భాగంగా అనారోగ్యంగా ఉన్న శ్రీ డి రామచంద్రయ్య గారిని కలిసి పరామర్శించడం జరిగినది.ఆయన త్వరగా కోలుకోవాలని మానవతా సంస్థ అభిలాష ఆయనకు ఏదైనా అవసరం వస్తే ఆత్మీయ సహకార కమిటీకితెలియజేయాలని ఆయనకు ధైర్యం చెప్పి రావడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు శ్రీ సమ్మెట సత్యనారాయణ శ్రీ కె మస్తానయ్య శ్రీ పి సురేంద్రబాబు జి.వెంకటేష్.గార్లుపాల్గొన్నారు.పుట్టా సుబ్రహ్మణ్యం చైర్మన్ ఆత్మీయ సహకార కమిటీ కడప నగరం.
చిట్వేలు మండలంలోని రాపూర్ రోడ్ నందు తిమ్మాయపాలెం క్రాస్: శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ} స్వామి. ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు, ఆలయానికి తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి కోడూరు మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులను ఆశీర్వదించారు. ఆలయ పరిసరాల్లో పిల్లలతో కలిసి భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిర్వహించబడింది. భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం వడ్డించగా అందరూ మహానందంగా స్వీకరించారు. ఈ వేడుకల విజయవంతమైన నిర్వహణలో ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ, నిర్వాహకులు చంద్రశేఖర్, ఆలయ పెద్దలు పద్నాతమ్మ, వెంకటసుబ్బయ్య, పొలంరాజు, చిన్నపరాజు, చంగల్‌రాజు, సుబ్బారెడ్డి, నాగలక్షమ్మ తదితరులు విశేష సహకారం అందించారు.
చిట్వేల్ ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి) శివ చిట్వేల్ గ్రామంలోని శివాలయంలో ఆడికృతిక శుభసందర్భంగా, శనివారము రోజున. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో. విశిష్టమైన ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం వేదఘోషాల నడుమ, అభిషేకము, శాస్త్రోక్తంగా జరిగి, అనంతరం పుష్పాలు, పండ్లు, రత్నాభరణాలతో. అద్భుతమైన అలంకరణ చేసి. స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారంలో గోపూజ పంచసూక్త ప్రకారంగా స్వామి వారికి పంచామృతం అభిషేకం సకల ద్రవ్యాలతో అభిషేకం వంటి పుణ్యకార్యాలు నిర్వహించబడ్డాయి. ఉత్సవాల్లో దూరదూరాల నుండి తరలి వచ్చిన భక్తులు పాల్గొని దైవానుభూతిని పొందారు. కార్యక్రమాలను ఆలయ పూజారులు పవన్ శర్మ , మరియు సురేంద్ర శర్మ గారు శ్రద్ధాభక్తులతో నిర్వహించగా, నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి , హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.