Monday, 21 September 2026
  • Home  
  • AP శాసనసభలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు
- విశాఖపట్నం

AP శాసనసభలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు

*ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన భాగ్యం* ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి ఏపీ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలిసి శాలువాతో సత్కరించారు. శాసనసభ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చలు, ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్పీకర్‌తో ఫొటోలు దిగారు. ఈ అనుభవం తమ విద్యాభ్యాసంతో పాటు భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యువతకు ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి పర్యటనలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ప్రొఫెసర్ ప్రేమానందం, అధ్యాపకులు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

*ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన భాగ్యం*

ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి ఏపీ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలిసి శాలువాతో సత్కరించారు. శాసనసభ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చలు, ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్పీకర్‌తో ఫొటోలు దిగారు.

ఈ అనుభవం తమ విద్యాభ్యాసంతో పాటు భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యువతకు ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి పర్యటనలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ప్రొఫెసర్ ప్రేమానందం, అధ్యాపకులు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.