*ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన భాగ్యం*
ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమరావతి వెళ్లి ఏపీ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలిసి శాలువాతో సత్కరించారు. శాసనసభ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చలు, ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్పీకర్‌తో ఫొటోలు దిగారు.
ఈ అనుభవం తమ విద్యాభ్యాసంతో పాటు భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యువతకు ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి పర్యటనలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ప్రొఫెసర్ ప్రేమానందం, అధ్యాపకులు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


