Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

​కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
​కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి మండలంలోని కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణ తీరుపై మంగళవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
  • ఎంపీడీఓ (ఎఫ్ఎసీ) వి.దీపిక, పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్‌ ల ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి బిన్ బ్యాగ్ విధానం అమలు అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
  • ​ఈ సందర్భంగా పలువురు గృహ యజమానులతో మాట్లాడి చెత్త సేకరణ, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

యలమంచిలి మండలంలోని కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణ తీరుపై మంగళవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంపీడీఓ (ఎఫ్ఎసీ) వి.దీపిక, పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్‌ ల ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి బిన్ బ్యాగ్ విధానం అమలు అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా పలువురు గృహ యజమానులతో మాట్లాడి చెత్త సేకరణ, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు బిన్ బ్యాగ్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుండటంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ​ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *