వార్త ముఖ్యాంశాలు
- 15వ వార్డు వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి..
- మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులు, గ్రామ ప్రజల మద్దతుతో ముందడుగు తుని మండలం ఎస్.
- అన్నవరం గ్రామ పంచాయతీలో 15వ వార్డు సభ్యుడిగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థి గుండుంపల్లి నాగరాజు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.
15వ వార్డు వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులు, గ్రామ ప్రజల మద్దతుతో ముందడుగు
తుని మండలం ఎస్. అన్నవరం గ్రామ పంచాయతీలో 15వ వార్డు సభ్యుడిగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థి గుండుంపల్లి నాగరాజు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజలు, అభిమానులు, పార్టీ మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో, గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన నాగరాజు వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజలతో కలిసి నడుస్తూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు, ఆశీస్సులు తనకు మరింత ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్