Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాక సర్పంచ్ బరిలో నాయుడు మాస్టర్.. కార్యకర్తల కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏటికొప్పాక సర్పంచ్ బరిలో నాయుడు మాస్టర్.. కార్యకర్తల కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు!

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి: ఏటికొప్పాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యన్నం శెట్టి సన్యాసిరావు (నాయుడు మాస్టర్) గురువారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.
  • ఏటికొప్పాక పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
  • ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీగా తరలివచ్చారు.

యలమంచిలి: ఏటికొప్పాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యన్నం శెట్టి సన్యాసిరావు (నాయుడు మాస్టర్) గురువారం ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఏటికొప్పాక పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీగా తరలివచ్చారు. నినాదాలతో గ్రామంలో సందడి నెలకొంది. ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని నాయుడు మాస్టర్ పేర్కొన్నారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఏటికొప్పాకను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *