Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

వైఎస్సార్ కార్డుల పంపిణీలో రాజాన సంజీవ్, మాసవరపు కాసుబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వైఎస్సార్ కార్డుల పంపిణీలో రాజాన సంజీవ్, మాసవరపు కాసుబాబు

వార్త ముఖ్యాంశాలు

  • అచ్యుతాపురం, అక్టోబర్ 7: అచ్యుతాపురం మండలం వైఎస్సార్ నగర్ పూడి కాలనీలో బుధవారం వైఎస్సార్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
  • ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు పార్టీ నేతలు దేశం శెట్టి శంకర్రావు, లాలం రాంబాబు, కోనా బుజ్జి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
  • ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు, సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

అచ్యుతాపురం, అక్టోబర్ 7: అచ్యుతాపురం మండలం వైఎస్సార్ నగర్ పూడి కాలనీలో బుధవారం వైఎస్సార్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు పార్టీ నేతలు దేశం శెట్టి శంకర్రావు, లాలం రాంబాబు, కోనా బుజ్జి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు, సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని వైఎస్సార్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజాన సంజీవ్, యూత్ ప్రెసిడెంట్ మాసవరపు కాసుబాబు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా, చురుగ్గా పనిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *