వార్త ముఖ్యాంశాలు
- పల్లె పండుగ 3.0లో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా నునపర్తి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
- గ్రామంలోని శ్మశానవాటికకు సుమారు రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు.
- కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
పల్లె పండుగ 3.0లో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా నునపర్తి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని శ్మశానవాటికకు సుమారు రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నునపర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రటరీ మధు, మాజీ సర్పంచ్ అనురాధ, మాజీ ఎంపీటీసీ వెన్నెల అప్పలనాయుడు, జనసేన నాయకులు రెడ్డి రాజేష్, వర్రి పేరునాయుడు, చుక్క కృష్ణ, బి.శ్రీను, నూకరాజు, పైల అప్పారావు, బి.రాము, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.