Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి బలమైన పునాది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి బలమైన పునాది

వార్త ముఖ్యాంశాలు

  • పార్టీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ వైఎస్సార్‌సీపీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు పిలుపునిచ్చారు.
  • ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు గోర్లీ ధర్మవరం, వెదురువాడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ (వైఎస్సార్ నగర్)లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అందుబాటులో ఉండాలని సూచించారు.

పార్టీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ

వైఎస్సార్‌సీపీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అచ్యుతాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు పిలుపునిచ్చారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు గోర్లీ ధర్మవరం, వెదురువాడ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ (వైఎస్సార్ నగర్)లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి కోన బుజ్జి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లాలం రాంబాబు మాట్లాడుతూ ఐక్యతతో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేకూరి శ్రీను వాసరాజు, చేపల శ్రీరాములు, గంగూలీ శ్రీను, పుర్రె సన్యాసిరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *