ఎస్‌బీ డీఎస్పీగా బాబ్జీరావు బాధ్యతలు
ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) : అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీగా నూతనంగా నియమితులైన వి.బాబ్జీరావు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందజేశారు. 1995 ఎస్సై బ్యాచ్‌కు చెందిన బాబ్జీరావు గతంలో సీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు. గతంలో అనకాపల్లి ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహించి ప్రజలు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌బీ కీలకమని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు, సంఘటనలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి పోలీసు శాఖను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో సమాచార వ్యవస్థను బలోపేతం చేసి అవాంఛనీయ ఘటనలను ముందుగానే నివారించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఎస్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.
