संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

పాములు, పందుల నిలయంగా మామిడి కొండయ్య వీధి..!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పాములు, పందుల నిలయంగా మామిడి కొండయ్య వీధి..!

खबर की मुख्य बातें

  • పారిశుధ్యం కరువు..
  • వీధి దీపాలు లేవు..
  • అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన!

పారిశుధ్యం కరువు.. వీధి దీపాలు లేవు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన!

పున్నమి – కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) :

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మామిడి కొండయ్య వీధిలో పారిశుధ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీధిలో పందుల సంచారం పెరగడంతో పాటు, అవి మృతి చెందినప్పుడు మృతదేహాలను తొలగించకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు, తరచూ విషసర్పాలు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రాత్రివేళ వీధి దీపాలు లేక చీకట్లు అలుముకుంటున్నాయి. కాలువల శుభ్రత సక్రమంగా లేకపోవడం, నీటి కుళాయిల లీకేజీలతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. పలుమార్లు అధికారులకు విన్నవించినా తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీగా ఉన్నప్పుడు కంటే మున్సిపాలిటీగా మారిన తర్వాత పన్నులు భారీగా పెరిగాయని, అయినప్పటికీ కనీస పారిశుధ్య సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధిని పరిశీలించి, కాలువల శుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, పందుల నియంత్రణ, నీటి లీకేజీల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *