संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
जगित्याल

తహసీల్దార్ కార్యాలయ భూమిలో పెట్రోల్ పంపు – జిల్లా కలెక్టర్ ను విచారణ కోరిన చుక్క గంగారెడ్డి – అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తహసీల్దార్ కార్యాలయ భూమిలో పెట్రోల్ పంపు – జిల్లా కలెక్టర్ ను విచారణ కోరిన చుక్క గంగారెడ్డి – అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు

తహసీల్దార్ కార్యాలయ భూమిలో పెట్రోల్ పంపు

– జిల్లా కలెక్టర్ ను విచారణ కోరిన చుక్క గంగారెడ్డి

అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు

జగిత్యాల, అక్టోబర్ 05:

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిలో పెట్రోల్ పంపు నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను జిల్లా ప్రజలకు వెల్లడించాలని సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ భూమిని ఏ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు, భూమి కేటాయింపు లేదా లీజు ఎలా జరిగింది, పెట్రోల్ పంపు నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా, నిర్వహణ బాధ్యత ఎవరిది అనే అంశాలను పరిశీలించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు.
ప్రభుత్వ భూమి వినియోగంలో పారదర్శకత, ప్రజా ప్రయోజనం కాపాడేలా చర్యలు తీసుకోవాలని, విచారణ అనంతరం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను తనకు అందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.
అలాగే జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇదే పెట్రోల్ పంపు నిర్మాణం పై 10 అంశాలతో కూడిన సమాచారం కోరుతూ చుక్క గంగారెడ్డి సోమవారం సమాచార హక్కు చట్టం -2005 సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేశారు.

తహసీల్దార్ కార్యాలయ భూమిలో పెట్రోల్ పంపు – జిల్లా కలెక్టర్ ను విచారణ కోరిన చుక్క గంగారెడ్డి – అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *