खबर की मुख्य बातें
- బుగ్గారం మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు - అధ్యక్షుడిగా నక్క సునీల్ ఏకగ్రీవ ఎన్నిక బుగ్గారం, సెప్టెంబర్ 7: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లతో మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు చేశారు.
- మండలంలోని ఉపసర్పంచ్‌ల సమస్యలను సమిష్టిగా పరిష్కరించడంతో పాటు, గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్రను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ఫోరంను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
- ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మద్దునూర్ ఉపసర్పంచ్ నక్క సునీల్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బుగ్గారం మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు
– అధ్యక్షుడిగా నక్క సునీల్ ఏకగ్రీవ ఎన్నిక
బుగ్గారం, సెప్టెంబర్ 7:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లతో మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు చేశారు. మండలంలోని ఉపసర్పంచ్‌ల సమస్యలను సమిష్టిగా పరిష్కరించడంతో పాటు, గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్రను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ఫోరంను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మద్దునూర్ ఉపసర్పంచ్ నక్క సునీల్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వెలుగొండ ఉప సర్పంచ్ బండ్ర అంజి గౌరవ అధ్యక్షుడిగా, గోపులాపూర్ ఉపసర్పంచ్ గైని సురేందర్ ఉపాధ్యక్షుడిగా, సిరికొండ ఉప సర్పంచ్ గజ్జెల విజయ్ ప్రధాన కార్యదర్శిగా,
యశ్వంత్రావుపేట ఉప సర్పంచ్ కోల శ్రీనివాస్ ను సహాయ కార్యదర్శి గా
చిన్నాపూర్ ఉపసర్పంచ్ చట్ట శ్రీనివాస్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ.. మండలంలోని ఉపసర్పంచ్‌ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఉపసర్పంచ్‌ల హక్కులు – బాధ్యతలపై సమిష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఫోరం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల ఉపసర్పంచ్‌లను సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు నక్క సునీల్ తెలిపారు.