Saturday, 3 October 2026
  • Home  
  • గాంధీ జయంతి సందర్భంగా మూలజంపలో గ్రామసభ
- అనకాపల్లి

గాంధీ జయంతి సందర్భంగా మూలజంపలో గ్రామసభ

125 రోజుల పనిదినాలపై అవగాహన.. పారిశుధ్యంపై ప్రజలకు పిలుపు పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) రాంబిల్లి: మండలంలోని మూలజంప గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ ప్రత్యేక అధికారి రాజు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వి.బి.జి. రామ్‌జీ మాట్లాడుతూ శ్రామికులకు 125 రోజుల పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గ్రామంలో చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులను గ్రామసభలో గుర్తించి ప్రతిపాదనలు అందిస్తే, నిబంధనల మేరకు పనులు మంజూరు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు వేగి రాము, యూనిట్ ఇన్‌చార్జి అందుకూరి ప్రసాద్, మాజీ సర్పంచ్ అచ్చయ్య నాయుడు, పంచాయతీ కార్యదర్శి దొరబాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.

125 రోజుల పనిదినాలపై అవగాహన.. పారిశుధ్యంపై ప్రజలకు పిలుపు

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

రాంబిల్లి: మండలంలోని మూలజంప గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ ప్రత్యేక అధికారి రాజు ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వి.బి.జి. రామ్‌జీ మాట్లాడుతూ శ్రామికులకు 125 రోజుల పనిదినాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గ్రామంలో చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులను గ్రామసభలో గుర్తించి ప్రతిపాదనలు అందిస్తే, నిబంధనల మేరకు పనులు మంజూరు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు వేగి రాము, యూనిట్ ఇన్‌చార్జి అందుకూరి ప్రసాద్, మాజీ సర్పంచ్ అచ్చయ్య నాయుడు, పంచాయతీ కార్యదర్శి దొరబాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.