Monday, 28 September 2026
  • Home  
  • పుట్టినరోజు వేడుకలకు పచ్చని పరిమళం.. అమ్మవారి సన్నిధిలో మొక్కలు నాటిన యువత!
- అనకాపల్లి

పుట్టినరోజు వేడుకలకు పచ్చని పరిమళం.. అమ్మవారి సన్నిధిలో మొక్కలు నాటిన యువత!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి సన్నిధిలో మొక్కలు నాటారు. దాసరి యువరాజ్–వెంకటలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు అక్షయ్ అశ్విన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటాలని కోరడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువత అక్షయ్ అశ్విన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను వ్యక్తిగత ఆనందానికే పరిమితం చేయకుండా గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా నిర్వహించిన దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శుభకార్యాలను పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దండు యస్వంత్, యువతేజ్, జయరాజ్, హర్ష, దాసరి వెంకటలక్ష్మి, అలవల నాగు, చిన్నారులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి సన్నిధిలో మొక్కలు నాటారు. దాసరి యువరాజ్–వెంకటలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు అక్షయ్ అశ్విన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటాలని కోరడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువత అక్షయ్ అశ్విన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను వ్యక్తిగత ఆనందానికే పరిమితం చేయకుండా గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా నిర్వహించిన దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శుభకార్యాలను పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దండు యస్వంత్, యువతేజ్, జయరాజ్, హర్ష, దాసరి వెంకటలక్ష్మి, అలవల నాగు, చిన్నారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.