జనగామ లో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం
రక్తదాన శిబిరం విజయవంతం: డాక్టర్ అంజిరెడ్డి
————————————————————————
నిత్య జీవితంలో ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును సాధించవచ్చని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ డాక్టర్ అంజిరెడ్డి అన్నారు.బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ లో
విశ్వ ఆయుర్వేద పరిషత్ , ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా సామాజిక బాధ్యతతో హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి ,ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రావ్య ,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును సాధించవచ్చని అన్నారు. ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన కల్పించడంతో పాటు, సామాజిక సేవా దృక్పథంతోనే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ శిబిరంలో 20 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విశ్వ ఆయుర్వేద పరిషత్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

నిత్య జీవితం లో ఆయుర్వేదం జీవన విధానాన్ని అలవార్చుకోవాలి : డాక్టర్ అంజిరెడ్డి
జనగామ లో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం రక్తదాన శిబిరం విజయవంతం: డాక్టర్ అంజిరెడ్డి ———————————————————————— నిత్య జీవితంలో ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును సాధించవచ్చని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ డాక్టర్ అంజిరెడ్డి అన్నారు.బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్నెస్ సెంటర్ లో విశ్వ ఆయుర్వేద పరిషత్ , ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా సామాజిక బాధ్యతతో హాస్పిటల్ ప్రాంగణంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి ,ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రావ్య ,బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును సాధించవచ్చని అన్నారు. ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన కల్పించడంతో పాటు, సామాజిక సేవా దృక్పథంతోనే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ శిబిరంలో 20 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, విశ్వ ఆయుర్వేద పరిషత్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

