నందలూరు: నందలూరు మండలంలోని అరవపల్లి పంచాయతీ సర్కిల్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా మా బాలు స్వీట్స్ వద్ద ప్రతిష్ఠించిన వినాయక మూర్తి తరఫున కమిటీ సభ్యులు కాణిపాకం వెళ్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి లడ్డూలను తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవాలకు సహకరించిన చందాదారుల ఇళ్లకు ఇంటింటికీ వెళ్లి లడ్డూలను అందజేశారు.
అదేవిధంగా నందలూరు మండలంలోని ప్రతి వినాయక మండపానికి సహకరిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్న ఎస్సై మల్లికార్జున రెడ్డికి కూడా కమిటీ సభ్యులు కాణిపాకం స్వామివారి లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


