ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని సీతారాంపురం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ బసిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ చప్పిడి తిరుపతిరెడ్డి, అయ్యవారిపల్లి యువ నాయకుడు కల్లూరు భరత్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే వచ్చే నెల 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లపై వారు మేకపాటి రాజగోపాల్ రెడ్డితో చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

మేకపాటి రాజగోపాల్ రెడ్డితో చింతంరెడ్డి సుబ్బారెడ్డి భేటీ