Sunday, 16 August 2026
  • Home  
  • ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఉదయగిరి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు విద్యార్థులు 200 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” నినాదాలతో పట్టణం మార్మోగింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువత, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.