కడపలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నందు గల పవన్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ లెక్కల జోగి రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దేశభక్తిని చాటేలా విద్యార్థులు వివిధ సమరయోధుల వేషధారణలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.



